Imran Khan arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‭పై కశ్మీర్ హైవేలో అల్లర్లు.. రాళ్లు రువ్విన నిరసనకారులు, 30 మంది అరెస్ట్

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మంగళవారం నుంచి పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేశారు. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు అందుబాటులో లేవు. ఇమ్రాన్ ఖాన్‭కు సుప్రీంకోర్టులో ఊరట లభించినప్పటికీ రాజకీయ భవిష్యత్తు పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Imran Khan arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‭పై కశ్మీర్ హైవేలో అల్లర్లు.. రాళ్లు రువ్విన నిరసనకారులు, 30 మంది అరెస్ట్

Kashmir highway: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)ను ఇస్లామాబాద్ హైకోర్టు(Islamabad High Court)కి తీసుకువెళుతుండగా శుక్రవారం ఇస్లామాబాద్‌లోని శ్రీనగర్ హైవేపై పిటిఐ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. కాగా, నిరసనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు తీవ్రంగా శ్రమించాయి. కాగా, 30 మంది నిరసనకారుల్ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.

Maharashtra Politics: షిండే కలలో కూడా ఆ పని చేయడు.. ఉద్ధవ్ వ్యాఖ్యలకు పవార్ కౌంటర్

ఈ ఘటన అనంతరం శ్రీనగర్ హైవేను మూసివేసినట్లు ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు. “శ్రీనగర్ హైవే ట్రాఫిక్ కోసం మూసివేయబడింది. పౌరులు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలి” అని ఇస్లామాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇక ఇస్లామాబాద్‭లో 144 సెక్షన్ అమలు చేశారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధిస్తూ పాకిస్థాన్‌లో పోలీసులు అత్యవసర ఉత్తర్వులు విధించారు. “ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 అమలులో ఉంది. చట్టపరమైన ప్రక్రియను అడ్డుకోవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాము. పౌరులు ఇస్లామాబాద్ హైకోర్టు చుట్టూ తిరగకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నాము” అని ఇస్లామాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.

Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు 2 వారాల బెయిల్