Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 2 వారాల బెయిల్
భూమి కబ్జా కేసులో కొన్ని రోజుల క్రితం ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్ట్ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది చనిపోయారు. సుమారు 2,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.

Imran Khan
Islamabad High Court: అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు(Al Qadir Trust case)లో అరెస్టైన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాన్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు రెండు వారాల బెయిల్ ఇస్తున్నట్లు శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు (Islamabad High Court) ప్రకటించింది. పారామిలిటరీ రేంజర్ల అదుపులో ఉన్న ఇమ్రాన్‌ను వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ మరుసటి రోజే ఆయనకు బెయిల్ లభించడం గమనార్హం. భూమి కబ్జా కేసులో కొన్ని రోజుల క్రితం ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. అనంతరం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?
ఇమ్రాన్ అరెస్ట్ విషయంలో రెండు కోర్టులు పూర్తి విరుద్ధమైన అభిప్రాయాలను వెల్లడించాయి. ఇమ్రాన్ అరెస్ట్ చట్టవ్యతిరేకమని, దుర్మార్గమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించగా.. అరెస్టును ఇస్లామాబాద్ హైకోర్టు సమర్థించింది. ఇక ఇమ్రాన్ అరెస్ట్ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది చనిపోయారు. సుమారు 2,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.
కోర్టు ప్రాంగణంలో అరెస్ట్ చేయడాన్ని పాకిస్తాన్ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘అరెస్టుకు ముందు అధికారులు కోర్టు రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాలి. అలా చేయలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణే. అరెస్టు క్రమంలో న్యాయస్థానం సిబ్బంది కూడా వేధింపులను ఎదుర్కొన్నారు’’ అని కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్ ఖదీర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్‌కు 8 రోజుల జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ) కస్టడీకి అప్పగిస్తూ అవినీతి నిరోధక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కాగా, మరుసటి రోజే (గురువారం) ఆయనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక శుక్రవారం ఆయనకు బెయిల్ కూడా ఇవ్వడం గమనార్హం.