UK Youth : దొంగలుగా మారుతున్న బ్రిటన్ యువత, సూపర్ మార్కెట్లలో చోరీలు .. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బ్రిటన్ లో యువతకు ఏమైంది? ఎందుకు దొంగలుగా మారుతున్నారు? సూపర్ మార్కెట్లలో చోరీలు ఎందుకు చేస్తున్నారు?

UK Youth : దొంగలుగా మారుతున్న బ్రిటన్ యువత, సూపర్ మార్కెట్లలో చోరీలు .. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

UK Youth shoplifting

UK Youth : బ్రిటన్ ప్రజలు దొంగలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా యువత దొంగతనాలకు బాగా అలవాటుపడిపోతున్నారట. ప్రతీ 10మంది యువతలో ఒకరు దొంగగా మారుతున్నారట..దొంగతనాలు చేస్తున్నారట..ఇదేదో జోక్ కాదు నిజమే..ఎవరో ఆరోపించింది కాదు..ఓ సర్వేలో తేలింది. ప్రతీ 10మంది యువతలో ఒకరు దొంగతనాలు చేస్తున్నారట..ఆ దొంగతనం ఏదో డబ్బో లేదా బంగారమో వాహనాలో కాదు సూపర్ మార్కెట్లలో నిత్యావసరవస్తువుల్నే చోరీ చేస్తున్నారట..ట్యాగులను మార్చేస్తూ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఏమార్చి చోరీలు చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. పాపం ఎందుకో తెలిస్తే షాక అవుతాం..

యువత చోరీలకు పాల్పడటం వెనుక ఉన్న కారణం తెలిస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. జీవన వ్యయం బాగా పెరిగిపోవటంతో షాపుల్లో చిన్న చిన్న చోరీలకు అలవాటుడుతున్న దుస్థితి ఏర్పడుతోంది బ్రిటన్ యువతకు. గత కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్స్ (10.4 శాతం)‌లో ఉండగా.. నిత్యావసరాలు, చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇంటికి సరిపడా సరుకులు కొనుక్కోలేక ఇలా చిన్న చిన్న చోరీలకు అలవాటుపడుతున్నారు.

బ్రిటన్ పౌరులు గత రెండేళ్లుగా స్థిరమైన జీవన వ్యయ సంక్షోభాన్ని భరిస్తున్నారు. ఈ పరిస్థితితో ఇంటి అవసరాలు తీర్చుకోవటానికి ఇలా చోరీలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్ధితి యూకే అంతటా 2021, 2022 మధ్య జీవన వ్యయం బాగా పెరిగింది. ఇటువంటి పరిస్థితి షాపుల్లో దొంగతనాలు, దోపిడీలకు పురిగొల్పుతోందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ప్రతి పది మంది యువతలో ఒకరు సూపర్ మార్కెట్‌ల నుంచి వస్తువులను దొంగిలిస్తున్నారు. ట్యాగులను మార్చేస్తూ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఏమార్చి దొంగతనం చేస్తున్నారు.

అధిక ధరల భారంతో బ్రిటన్ ప్రజలు ఇలా చేయాల్సి వస్తోంది. ఆహారం, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ ధరలు 19.1 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నానా పాట్లు పడుతున్నారు. మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలైతే డబుల్, ట్రిపుల్ అయ్యాయి. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తాజా డేటా ప్రకారం దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలు గత సంవత్సరం మొదటి మూడు నెలల నుంచే బాగా పెరిగిపోయాయి. మరో నివేదిక ప్రకారం యూకేలో తరచుగా దొంగతనం చేస్తోన్న వస్తువులలో పిల్లల మందుల కాల్పోల్ వంటి ముఖ్యమైనవిగా ఉన్నాయి. పాలు, చీజ్ వంటి నిర్దిష్ట ఉత్పత్తులపై భద్రతా ట్యాగ్‌లు తీసేసి చోరీ చేస్తున్నారు.

యూకేలోని నాలుగు దేశాల్లో ఇంగ్లండ్, వేల్స్‌కు సంబంధించిన ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాలు సెప్టెంబరుతో ముగిసిన సంవత్సరంలో షాప్‌లిఫ్ట్‌లు 22 శాతం పెరిగాయని ది ఇండిపెండెంట్ వెల్లడించింది. బ్రిటీష్ రిటైల్ కన్సార్టియం గణాంకాలు అదే సూచిస్తున్నాయి. 2022లో 7.9 మిలియన్ కేసులు నమోదయ్యాయి. 2016-17 కంటే ఐదు మిలియన్లు ఇవి ఎక్కువ. ఇంతలో సెంటర్ ఫర్ రిటైల్ రిసెర్చ్ 2022 అధ్యయనం ప్రకారం షాప్ లిఫ్టింగ్ వల్ల 2021-22లో బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థకు 660 మిలియన్ పౌండ్లు నష్టం జరిగింది.