గురునానక్ 550 జయంతి: స్మారక నాణెం విడుదల చేసిన పాక్

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 10:09 AM IST
గురునానక్ 550 జయంతి: స్మారక నాణెం విడుదల చేసిన పాక్

Updated On : October 30, 2019 / 10:09 AM IST

సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్  స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్‌ కర్తార్‌పూర్ సాహిబ్‌లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 

కాగా, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌కు వెళ్లే 575 మంది తొలి విడత యాత్రికుల జాబితాను పాక్‌కు భారత్ అందజేసింది. ర్తార్‌పూర్ వెళ్లే తొలి బృందం నవంబర్ 9న పాక్‌కు బయలుదేరుతుంది.

పాక్ తొలి విడత యాత్రీకుల లిస్ట్ లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు హర్తీప్ పూరి, హర్సిమత్రత్ కౌర్ బాదల్,పంజాబ్ సీఎం అమరీంతర్ సింగ్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే ఉన్నారు. 

గురునానక్ దేవ్ 550వ జయంతి నవంబర్ నెలలో ప్రారంభోత్సవానికి ముందు మార్గం సుగమం చేస్తూ..కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను అమలు చేసే పద్ధతులపై భారత్ అక్టోబర్ 24న పాకిస్థాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంట్లో భాగంగా పాకిస్తాన్ గురు నానక్ పుణ్యక్షేత్రం గురుద్వార దర్భార్ సాహిబ్ ను సందర్భించే ప్రతీ భారతీయుడి నుంచి పాకిస్థాన్ 20 USd డాలర్లను సర్వీస్ చార్జీలుగా  వసూలు చేస్తుంది. 

కర్తార్ పూర్ కారిడార్ ను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 9న ప్రారంభించనున్నారు. కాగా..జమ్మూ కశ్మీర్ విషయంలో ఆర్టీకల్ 370ని రద్దు చేసిన అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య కర్తార్ పూర్ కారిడార్ యాత్ర ఇదే మొదటిది.

సిక్కుల మత గురువు గురునానక్ నానక్ పుణ్యక్షేత్రం గురుద్వార దర్భార్ సాహిబ్ ను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతీ సిక్కు భావిస్తాడు. పాకిస్థాన్ లోని పంజాబ్ నారోవాల్ జిల్లాలో ఉన్న గురునానక్ పుణ్యక్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించాలనుకునే యాత్రికులకు 11,000 రూపాయలు, 7 కిలోల బ్యాగ్ తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందని తెలిపింది.