అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించాలంటూ పాక్ జర్నలిస్టులు ర్యాలీ

  • Published By: veegamteam ,Published On : March 1, 2019 / 10:22 AM IST
అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించాలంటూ పాక్ జర్నలిస్టులు ర్యాలీ

Updated On : March 1, 2019 / 10:22 AM IST

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జర్నలిస్టులు భారత్ కు మద్దతుగా నలిచారు. లాహోర్ ప్రెస్ క్లబ్ ఎదుట శాంతి ర్యాలీ నిర్వహించారు. వింగ్ కమాండర్ అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించాలని పాక్ జర్నలిస్టులు కోరారు.  తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

పాకిస్తాన్ యుద్ధ విమానాలను తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27 బుధవారం భారత్ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కాడు. పాక్ భూభాగంలోకి ప్రవేశించిన అభినందన్ ను చిత్రహింసలకు గురిచేశారు. అతనిపై దాడికి పాల్పడ్డారు. యుద్ధ ఖైదీపై దాడి చేయడం, హింసించడం జెనీవా ఒప్పందానికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
Read Also : ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట : పాక్ డిమాండ్

చైనా, రష్యా భారత్ కు అండగా నిలిచాయి. తీవ్ర నిరసన వ్యక్తమవ్వడంతో అభినందన్ ను భారత్ కు అప్పగించేందుకు పాక్ సిద్ధమైంది. తమ అదుపులో ఉన్న అభినందన్ ను శాంతి ప్రక్రియలో భాగంగా విడుదల చేస్తున్నట్లు గురువారం పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. 
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే