మసీదులో బాంబు పేలి 8మంది మృతి

నైరుతి పాకిస్తాన్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి ఓ పోలీసాఫీసర్ తో పాటు 8మంది మృతి చెందారు. గాయాలకు గురైన 11మందిని క్విట్టా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసు అజ్మల్ మాట్లాడుతూ.. స్లెయిన్ పోలీస్ ఆఫీసర్ ను  టార్గెట్ చేసి దాడి జరిపారని అధికారులు ఆధారాల కోసం దర్యాప్తు జరుపుతున్నారని వెల్లడించారు. 

బాంబు ప్రమాదానికి సంబంధించి బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించలేదు. గతేడాది మే నెలలో క్విట్టాలో పేలిన బాంబు ప్రమాదంలో ఇమామ్ తో సహా ఇద్దరు చనిపోయారు. 28మంది గాయాలతో బయటపడ్డారు. ఆగష్టులోనూ ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. 

పాకిస్తానీ మిలిటెంట్లు బలూచిస్తాన్ ప్రాంతంలో ఇటువంటి పనులు ఎక్కువగా చేస్తుంటారు. గ్యాస్, ఆయిల్ ఎక్కువగా దొరికే ప్రాంతంలో చేయడంతో రవాణా సైతం బిక్కుబిక్కుమంటూనే జరుగుతుంటుంది. అఫ్ఘనిస్తాన్-ఇరాన్ ల సరిహద్దును కల్గి ఉన్న క్విట్టాలో అఫ్ఘన్ తాలిబాన్లు ఎక్కువ శాతంలోనే ఉంటారు.