Pakistan PM Covid-19 positive : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కోవిడ్ పాజిటివ్..
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్-19 పరీక్షలో ఆయన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్ సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Pakistan PM Shehbaz Sharif tests positive for Covid-19
Pakistan PM Shehbaz Sharif tests positive for Covid-19 : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్-19 పరీక్షలో ఆయన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్ సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబు ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల ఐదు రోజుల పాటు బ్రిటన్‌లో పర్యటించి వచ్చిన పాక్ ప్రధాని కొంత అస్వస్థతకు లోనయ్యారు.
రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్యం సరిగా లేదు. దీంతో డాక్టర్ సలహా ప్రకారం కోవిడ్ పరీక్ష చేయించుకోవటంతో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రధాని షెహబాజ్ ఆరోగ్యం కోసం ప్రజలు ప్రార్థించాలని మంత్రి కోరారు. కాగా హెహబాజ్ కు కోవిడ్ రావటం ఇదో మూడవసారి. 2021లో ఓ సారి కోవిడ్ బారిన పడగా 2022 జనవరిలో మరోసారి మహమ్మారి బారినపడ్డారు.