ఇమ్రాన్ ఖాన్ ప్రకటన : రేపే కమాండర్ అభినందన్ విడుదల

  • Publish Date - February 28, 2019 / 11:14 AM IST

పాక్ పై భారత ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. పాక్ చెరలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేయనున్నట్లు  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు. శాంతి ప్రక్రియల్లో ముందడుగుగా అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు. విడుదల చేయాలనుకున్న తమ నిర్ణయాన్ని పిరికితనంగా భావించవద్దని ఇమ్రాన్ అన్నారు.అభినందన్ ను విడుదల చేయాలని ప్రపంచదేశాలు పాక్ పై ఒత్తిడి పెంచడంతో దిక్కుతోచని స్థితిలో అభినందన్ విడుదలకు పాక్ సిద్ధమైంది.
Read Also : కాళ్లబేరానికి పాక్ : మోడీతో ఫోన్ లో మాట్లాడటానికి సిద్ధమన్న ఇమ్రాన్ 

జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని, వారం రోజుల్లోగా విక్రమ్ అభినందన్ ను విడుదల చేయకుంటే అధికారికంగా యుద్ధం ప్రకటించినట్లే భావించాలని పాక్ కు బుధవారం(ఫిబ్రవరి-27,2019) భారత ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభినందన్ ను విడుదల చేయాలని, ఉగ్రవాదంపై పాక్ తన వైఖరి మార్చుకోవాలని చైనా, రష్యాలు వార్నింగ్ తో పాక్ బెంబేలెత్తింది.
Read Also : అభినందన్‌ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?

చైనా కూడా పాక్ కు మద్దతు విషయంలో వెనకడుగు వేయడంతో దిక్కుతోచని స్థితిలో కాళ్లబేరానికి వచ్చిన పాక్ భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమని, ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోడీతో ఫోన్ లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి గురువారం(ఫిబ్రవరి-28,2019) ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్ కు తిరిగిరాలని భారతీయులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. శుక్రవారం భారత్ లో విక్రమ్ అడుగుపెట్టబోతున్నారు.

Read Also : ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ : సముద్రంలో పెట్రోలింగ్