పాక్ టీవీ బ్రేకింగ్స్ : రెండు భారత యుద్ధ విమానాలు కూల్చేశాం

  • Publish Date - February 27, 2019 / 07:18 AM IST

పాకిస్తాన్ ప్రభుత్వంతోపాటు మీడియా కూడా బాగా యాక్టివ్ రోల్ చేస్తోంది. పాక్ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశాం అని ప్రకటించింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ఒక పైలెట్ చనిపోయాడని.. మరో పైలెట్ ను సజీవంగా పట్టుకున్నాం అని ప్రకటించారు ఆ దేశ విదేశాంగ మంత్రి గఫూర్ ప్రకటించారు.
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు

పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేవేశాం.. అందులో ఒకటి పీవోకేలో పడిందని, మరొక విమానం కశ్మీర్‌లో పడిందని చెబుతూ పాకిస్తాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్ చేశారు. పాక్ సైన్యం అదుపులో ఆ పైలెట్ ఉన్నాడని.. విచారిస్తున్నాం అని పాక్ మీడియా వెల్లడించింది. వాటికి సంబంధించిన ఫొటోలు ఇవే అంటూ పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భారత్ కు ధీటుగా పాక్ సైన్యం సమాధానం చెబుతోంది కథనాలు రాస్తున్నారు. ఏది నిజం.. ఏది అబద్ధం అనేది ఇంకా తెలియదు. పాకిస్తాన్ సైన్యాధికారి ప్రకటనపై.. భారత్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్