డ్రాగన్ సాయం కోరిన పాక్.. CPEC ప్రాజెక్ట్ కోసం 2.7 బిలియన్ డాలర్లు రుణం కావాలంట!

China for CPEC project : ప్రతిష్టాత్మక ఎకనామిక్ కారిడార్ CPEC ప్రాజెక్టు కోసం పాకిస్తాన్ డ్రాగన్ సాయం కోరుతోంది. చైనా పాకిస్తాన్ మెయిన్‌లైన్-1 ప్రాజెక్ట్, ప్యాకేజీ-1 (CPEC) నిర్మాణానికి చైనా నుంచి 2.7 బిలియన్ డాలర్ల రుణం తీసుకోవాలని పాక్ నిర్ణయించింది.
పెషావర్ నుంచి కరాచీకి 1,872 కిలోమీటర్లను కలిపే రైల్వే ట్రాక్,అప్‌గ్రేడ్ చేసే ML-1 ప్రాజెక్టుకు సంబంధించి ఫైనాన్సింగ్ కమిటీ 6వ సమావేశంలో ప్రభుత్వ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
వాస్తవానికి మొత్తం అంచనా వేసిన చైనా ఫైనాన్సింగ్‌లో 6.1 బిలియన్ డాలర్లు అయినప్పటికీ పాకిస్తాన్ మొదట్లో చైనాను 2.73 బిలియన్ డాలర్లు మాత్రమే మంజూరు చేయాలని కోరింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొంతకాలంగా దివాలా అంచున ఉండగా.. COVID-19 మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది.
ప్రస్తుతం నెల చివరి నాటికి బీజింగ్ వచ్చే ఏడాది ఫైనాన్సింగ్ ప్రణాళికలను ఖరారు చేస్తుందని భావిస్తోంది. వచ్చే వారం అధికారికంగా చైనాకు లేఖ పంపాలని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు రిపోర్టు నివేదించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ 1 శాతం వడ్డీ రేటును కోరుతూ చైనా రుణానికి సంబంధించి కాల పరిమితిని షేర్ చేసింది. చైనా పాక్ అభ్యర్థనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. వడ్డీ రేటు కంటే ఎక్కువ ఉండవచ్చని అనధికారికంగా చైనా అధికారులు అంటున్నారు.
మే నెలలో పాకిస్తాన్ మాజీ అమెరికా రాయబారి హుస్సేన్ హక్కానీ చైనాతో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో 62 బిలియన్ డాలర్ల విలువైన CPEC ప్రాజెక్టుని నిర్మించారు. ఇందులో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి.
దీనిలో కనీసం మూడోవంతు చైనీస్ ప్రాజెక్టులకు సంబంధించినవే ఉన్నాయి. ప్రాజెక్టు కోసం వడ్డీ మినహాయింపు 48 నెలలు అనుమతించారు.