Women Tiktoker Assaulted By In Lahore
women tiktoker assaulted by in lahore : పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఓమహిళపై అత్యంత దారుణానికి ఒడిగట్టారు కొంతమంది వ్యక్తులు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ఓ మహిళా టిక్‌టాకర్‌పై దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ దారుణ ఘటన జరగటం గమనించాల్సిన విషయం.ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఆరోజున ఓ మహిళా టిక్‌టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్దకు వెళ్లింది. అక్కడ వీడియోను చిత్రీకరిస్తుండగా అదే సమయంలో సుమారు 300నుంచి 400లమంది మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు.
ఆమెను గాల్లోకి ఎగరేస్తూ..ఒంటిపై బట్టలు చించేయటానికి యత్నించారు. అందరూ కలిసి ఒక్కసారిగా మీద పడి దాడి చేసేసరికి ఆమెకు ఊపిరి ఆడలేదు. హడలిపోయింది. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి ఆమె శతవిధాలుగా యత్నించారు. పెనుగులాడారు.కానీ సాధ్యంకాలేదు. ఆమెను ఇష్టమొచ్చినట్లుగా దుర్భాషలాడుతూ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించారు. కొంతమంది ఆమెపై చెప్పులు విసిరారు. బలవంతంగా ఆమె వేలికి ఉన్న ఉంగరం, చెవి రింగులు లాగేసుకున్నారు. ఆమె స్నేహితుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఐడీ కార్డుతో పాటు వారి వద్ద ఉన్న డబ్బుని కూడా లాగేసుకున్నారు.
ఆమె పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి ఆమె తన స్నేహితులతో చావు తప్పినట్లుగా బయటపడింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది.
ఈ ఘటనపై పాకిస్తాన్ సెక్షన్ 354A సెక్షన్ 354A (మహిళపై దాడి లేదా బలవంతంగా ఉపయోగించడం మరియు దుస్తులు చింపివేయడం), 382 (హత్య ఉద్దేశంతో దొంగతనం, దోపిడీ ఉద్దేశ్యంతో నష్టం), 147 (అల్లర్లు) మరియు 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు సూపరింటెండెంట్‌ని ఆదేశించారు. ఫుటేజీల సాయంతో నిందితుడిని గుర్తించాలని..మహిళ గౌరవాన్ని ఉల్లంఘించి, వేధించడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిఐజి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.