Pak vs China: మిత్ర దేశానికి షాకిచ్చిన పాక్.. ఆ డబ్బులన్నీ వృథా..

తన మిత్ర దేశమైన చైనాకు పాకిస్థాన్ షాకిచ్చింది. చైనా - పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) అథారిటీ రద్దు చేస్తూ పాక్ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ నూతన ప్రధాని షెహబాబ్ ...

Pak China

Pak vs China: తన మిత్ర దేశమైన చైనాకు పాకిస్థాన్ షాకిచ్చింది. చైనా – పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) అథారిటీ రద్దు చేస్తూ పాక్ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ నూతన ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఆదేశాల మేరకు ప్రణాళికా మంత్రి అషన్ ఇఖ్బాల్ ఈ ప్రాజెక్టులను వనరులను వృథా చేసే అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

China: చైనా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లపై భారత్‌కు ఎందుకంత ఆందోళన?బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌కు నష్టమేంటీ?

చైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్‌లోని బలూచిస్థాన్ పరిధిలో గల గదర్ ఓడరేవు మధ్య మౌలిక వసతులు, ఇంధన ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2019లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల మేర ప్రాజెక్టులనుద్దేశించి అథారిటీని నియమించారు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం సగానికి పైగా ఖర్చు చేశామనని చైనా వాపోతోంది. పాక్ నిర్ణయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనులు సగంకుపైగా పూర్తయిన నేపథ్యంలో పాక్ నూతన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏమిటని చైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.