China: చైనా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లపై భారత్‌కు ఎందుకంత ఆందోళన?బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌కు నష్టమేంటీ?

టిబెట్‌ సెంటర్‌ పాయింట్‌గా చైనా నిర్మిస్తున్న హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ల భారత్‌కు ఎందుకు అంత ఆందోళన? బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌కు ఏ మేర నష్టం జరుగుతుంది?

China: చైనా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లపై భారత్‌కు ఎందుకంత ఆందోళన?బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌కు నష్టమేంటీ?

China Hydropower Project

China Hydropower Project : టిబెట్‌ సెంటర్‌ పాయింట్‌గా చైనా ఎడాపెడా నిర్మిస్తున్న హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ల భారత్‌కు ఎందుకు అంత ఆందోళన? వాటి నిర్మాణాల వల్ల ఏం జరుగుతుందని భయపడుతోంది? బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌కు ఏ మేర నష్టం జరుగుతుంది?

టిబెట్‌లో ఊపిరి పోసుకుని భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్, అసోం గుండా మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌ వైపునకు తరలిపోయే బ్రహ్మపుత్ర నది జలాలపై ఆధారపడి కోట్లాదిమంది జీవిస్తున్నారు. ఇప్పుడు టిబెట్‌వైపున బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మించాలనే చైనా ఆలోచన వల్ల భారత్‌ తీవ్రంగా నష్టపోతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత్‌కు అత్యంత సమీపంలో నిర్మించ తలపెట్టిన ఆ మెగా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌కు చైనా ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు భారత అధికార వర్గాలు చెప్తున్నాయి. అందుకోసం టిబెట్‌ నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించి తమ దేశంలోని ఉత్తర ప్రాంతాలకు తరలించాలని చైనా పక్కా ప్లాన్‌ వేసిందని ఆరోపిస్తున్నాయి.

Also read : China: చైనా కుట్ర..ఆసియాలోనే అతిపెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు..బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మాణం యోచన

దీనిపై చైనా వాదన మరో విధంగా వుంది. టిబెట్‌లోని హిమాని నదాలనుంచే అనేక నదులు ఊపిరి పోసుకుంటాయి. అయితే వాటిలో కేవలం జిన్షా, లంకాంగ్‌, న్యూజింగ్‌ నదులపై మాత్రమే డ్యామ్‌లు చేపడుతున్నామని, బ్రహ్మపుత్ర నదిపై కాదంటూ చైనా బొంకుతోంది. వాస్తవానికి ఆ నదులపై నిర్మాణాల సందర్భంలోనే ఆందోళన వ్యక్తం చేసిన భారత్‌….భవిష్యత్తులో చైనా మరిన్ని ప్రాజెక్ట్‌లు చేపడితే బ్రహ్మపుత్రలో నీటి ప్రవాహం గణనీయంగా పడిపోతుందని, దాని ప్రభావం తమ దేశంపై తీవ్రంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరొక విషయం కూడా భారత్‌ ఆందోళనకు కారణమవుతోంది. థాయ్‌లాండ్‌-లావోస్‌ల మీదుగా ప్రవహించే మెకాంగ్‌ నది…రెండు మూడేళ్లలో పూర్తిగా ఎండిపోతుందనే పర్యావరణ వేత్తల హెచ్చరిక..భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Also read : Ukraine russia war : లివివ్‌పై రష్యా సైన్యం క్షిపణుల వర్షం.. జెలెన్ స్కీ ఏం చేశాడంటే..

చైనా నిర్మించ తలపెట్టిన మెగా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల బ్రహ్మపుత్ర నది కూడా పూర్తిగా అంతరించిపోతుందని భారత్‌ ఆందోళన పడుతోంది. ఆ నదిపై ఆధారపడి జీవిస్తున్న కోట్లమంది జీవనాధారాన్ని కోల్పోయే ప్రమాదం వుందని భయపడుతోంది. అదొక్క ప్రాజెక్ట్‌ వల్లే కాదు టిబెట్‌ వెలుపల న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్స్‌, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛానెల్స్‌ నిర్మాణాలకు కూడా చైనా ప్లాన్‌ చేస్తోందన్న వార్త భారత్‌ను వణికిస్తోంది. బ్రహ్మపుత్ర నదీ జలాలు…భారత్‌ మీదుగా ప్రవహించకుండా అడ్డుకునేందుకు చైనా కుట్ర పన్నుతున్న క్రమంలోనే..ముందు జాగ్రత్త పడాలనే ఆలోచనలో భారత్‌ వుంది. బ్రహ్మపుత్ర నదిపై తామూ ఓ ప్రాజెక్ట్‌ నిర్మించాలని యోచిస్తోంది. చైనా మెగా హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్ వల్ల వాతావరణ సమతౌల్యత దెబ్బతింటుందని..ఏళ్ల తరబడి భారీ నిర్మాణాలు కొనసాగించడం వల్ల భూమి కుంగిపోతుందని..భూకంపాలు సంభవిస్తాయని.. నది జలాల కింద అడవులు మునిగిపోయి వన్యప్రాణులు అంతరించిపోతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. మానవాళి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు.

Also read : Jio Vs Airtel Vs Vodafone : రూ.300లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు.. Daily Data బెనిఫిట్స్ మీకోసం..

పర్యావరణ వేత్తల ఆందోళనకు కారణం లేకపోలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ స్టేషన్ త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ వల్ల కొన్ని పెద్ద పట్టణాలు, 1000కి పైగా గ్రామాలు మునిగిపోయాయి. కనీసం లక్ష మంది నిర్వాసితులయ్యారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్‌ నిర్మిస్తే…అంతకంటే ఎక్కువ ప్రభావం వుండే ప్రమాదం వుందని అంటున్నారు. వరదలు వెల్లువెత్తుతాయని లేదా కరువు సంభవిస్తుందని, వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తాయని పర్యావరణ వేత్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత్‌-చైనాల మధ్య ఎలాంటి నదీ జలాల ఒప్పందాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని, అందుకే బ్రహ్మపుత్ర నీటిని దోచేయడానికి చైనా వ్యూహం పన్నుతోందని భారత అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి.