China: చైనా కుట్ర..ఆసియాలోనే అతిపెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు..బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మాణం యోచన

చైనా కుట్ర..ఆసియాలోనే అతిపెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు చేస్తోంది...బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మాణం యోచనలో ఉంది.

China: చైనా కుట్ర..ఆసియాలోనే అతిపెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు..బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మాణం యోచన

China Set To Build ‘super Dam’ On Brahmaputra River

China set to build ‘Super Dam’ on Brahmaputra river : చైనా భారీ కుట్రకు పథకం వేస్తోందా? టిబెట్‌లో భారీ ప్రాజెక్ట్‌లు నిర్మించి ఆసియాలోనే అతి పెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు చేస్తోందా? సహజ సిద్ధమైన నదీ ప్రవాహాలకు అడ్డుకట్ట వేసే జలాలను తరలించుకుని పోవాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తోందా? నదులను ఎండబెట్టి…అనేక దేశాలను ఎడారుగా మార్చే భయానక ఆలోచనకు పావులు కదుపుతోందా?

భారత్‌కు పక్కలో బల్లెమైన చైనా….దుర్మార్గపు ఆలోచనలు ఊహకందని విధంగా సాగుతున్నాయి. ఆక్రమిత టిబెట్‌ను అడ్డం పెట్టుకుని భయానకమైన కుట్రకు చైనా పథకం వేస్తోందన్న అనుమానాలకు ఆ దేశం చేపడుతున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అభివృద్ధి ప్రణాళిక మాటున ప్రకృతికి తీవ్ర నష్టం కలిగేలా, సహజ సిద్ధమైన నదీ ప్రవాహాల గమనాన్ని దెబ్బతీసే ఆలోచనలు చేస్తోంది. టిబెట్‌ సమీపంలో చైనా నిర్మించ తలపెట్టిన డ్యామ్‌ల పరంపర… ఆసియాలోని అతి పెద్ద నదులపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. టిబెట్‌ నదులపై వరుసగా మెగా ప్రాజెక్ట్‌లను చేపట్టడం ద్వారా దక్షిణ, ఆగ్నేయ ఆసియా జల సంపద, జీవావరణంపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తున్నారు.

Also read : Kodali Nani : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

వాస్తవానికి చైనా వ్యాప్తంగా 30 వేల డ్యామ్‌లు వున్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాల్లో ఉన్న డ్యామ్‌లకంటే చైనాలోనే ఎక్కువగా వున్నాయి. చైనాలోని డ్యామ్‌ల వల్ల ఆ దేశానికి ఎంత లబ్ది చేకూరిందోగానీ ఆ డ్యామ్‌ల వల్ల కింది ప్రాంతాల్లో వున్న అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాస్త ఆలస్యంగానైనా మేలుకున్న ఆ దేశాలు …ఇప్పుడు చైనా వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా తీరుపై మండిపడుతున్నాయి. ఆ దేశం ఎడాపెడా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల వల్ల తమ దేశాల్లో నదులు ఎడారులవుతున్నాయని ఆరోపిస్తున్నాయి.

బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్‌ నిర్మించాలనే చైనా ఆలోచన…అటు భారత్‌, ఇటు బంగ్లాదేశ్‌లపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం వుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. టిబెట్‌లోని చరిత్రాత్మక పెమా కోయ్‌ ప్రాంతంలో చైనా నిర్మించ తలపెట్టిన ఆ సూపర్‌ డ్యామ్‌….ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ స్టేషన్ త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కంటే పెద్దదని చెప్తున్నారు. నిజానికి 1990ల నుంచే మేకాంగ్ నది వెంబడి యున్నన్‌ ప్రావిన్స్‌లో చైనా అనేక డ్యామ్‌లు నిర్మించింది. 2021 ప్రారంభానికల్లా 50 శాతం మెకాంగ్‌ నది ప్రవాహానికి చైనా అడ్డుకట్ట వేయడంతో థాయిలాండ్‌, లావోస్‌, మయన్మార్‌ల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది.

Also read : Cows in Rajasthan: ఆవుల పెంపకానికీ లైసెన్స్ ఉండాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వ వింత నిర్ణయం

చైనా చేపట్టిన, చేపట్టబోతున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల వల్ల మెకాంగ్‌ నదీ దిగువ ప్రాంతాలన్నీ ఎడారులుగా మారుతున్నాయని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మపుత్రపై డ్యామ్‌ నిర్మిస్తే భారత్‌పైనే గాక భవిష్యత్తులో చైనా పొరుగున వున్న అనేక దేశాలపై కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా బలహీనమైన దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కుంటాయని, భయానక విపత్తులకు లోనవుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.