Cows in Rajasthan: ఆవుల పెంపకానికీ లైసెన్స్ ఉండాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వ వింత నిర్ణయం

పట్టణాలు, నగరాల్లో పశువులను పోషించే యజమానులు ఇకపై వార్షిక లైసెన్స్ పొందాల్సి ఉంటుందని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది

Cows in Rajasthan: ఆవుల పెంపకానికీ లైసెన్స్ ఉండాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వ వింత నిర్ణయం

Cows

Cows in Rajasthan: నగరాల్లో పట్టణాల్లో రోడ్లపై పశువులు సంచారంతో ప్రజలు, వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. పశువులను పోషించే యజమానులు వాటిని అలా రోడ్లపై వదిలేయడంతో..నగర వాసులు అవస్థలు పడుతుంటారు. పశువుల యజమానుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజస్థాన్ ప్రభుత్వం ఆమేరకు కఠిన నిబంధనలు తెచ్చింది. పట్టణాలు, నగరాల్లో పశువులను పోషించే యజమానులు ఇకపై వార్షిక లైసెన్స్ పొందాల్సి ఉంటుందని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ మునిసిపల్ కార్పొరేషన్లు మరియు కౌన్సిల్‌ల పరిధిలోని ఇళ్లలో ఆవులు గేదెలను పెంచుకునే యజమానులు ఇకపై వార్షిక లైసెన్స్ తీసుకోవాలి. ఆయా పశువుల పెంపకం కోసం కనీసం 100 చదరపు గజాల స్థలం కేటాయించేలా తప్పనిసరి చేసింది.

Also read:India Corona: భారత్‌లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 90శాతం పెరుగుదల.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..

పశువులు రోడ్లపై సంచరిస్తే యజమానులకు ₹10,000 వరకు జరిమానా విధించనున్నారు. లైసెన్సు లేకుండా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఆవు, దూడలను పెంచుకోరాదని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందడానికి, దరఖాస్తుదారు పశువుల కోసం నిర్దేశించిన స్థలం వివరాలతో పాటు..పశువుల వ్యర్ధాలను ఎలా నిర్వహిస్తున్నారనే విషయాలను నిర్ధారించాలి. పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ₹5,000 జరిమానా విధించనున్నారు.

Also read:GST 5 శాతం శ్లాబు ఎత్తివేత!

పశువులను పెంచే యజమానులు ప్రతి 10 రోజులకు ఒకసారి ఆయా వ్యర్ధాలను పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్దేశించిన వ్యర్ధనిర్వహణ ప్రదేశాల్లో పడేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఆవు పేడతో పిడకలు కూడా చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. అవును పెంచుకునేందుకు వార్షిక లైసెన్స్ ఫీజుగా ₹1,000 వసూలు చేయనున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలైతే 500 చెల్లించాల్సి ఉంటుంది.

Also read:Lakhimpur Case : అశిష్ మిశ్రా బెయిల్ రద్దు.. వారంలో లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు ఆదేశం!

ప్రభుత్వానికి అందించిన వివరాల ప్రకారం పశువుల సంఖ్య ఎక్కువగా ఉంటే లైసెన్స్‌ను రద్దు చేస్తారు. యజమాని పేరు మరియు ఫోన్ నంబర్‌ను పశువులకు ట్యాగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో పశువుల మేత విక్రయాలు జరపకూడదని, నిబంధన అతిక్రమిస్తే ₹500 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. పశువుల పాక వద్ద యజమానూలు నేరుగా పాలు, తదితర ఉత్పత్తులను విక్రయించడానికి కూడా వీల్లేదు.

Also read:Natural Disasters: అస్సాంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నెల వ్యవధిలో 20 మంది మృతి