Snow fall: ప్రాణాలు తీసిన మంచుఅందాలు..కార్లలోనే 9మంది చిన్నారులతో సహా 21 మంది మృతి

తెల్లటి మంచుమేఘంలాంటి అందం 21మంది ప్రాణాలు తీసింది. మంచు అందాలు చూద్దామని వచ్చిన పర్యాటకులు కార్లలో చిక్కుకుపోయారు. 9మంది చిన్నారులతో సహా 21 మంది మృతి చెందారు.

21 Freeze To Death In Cars Stranded In Snow

21 freeze to death in cars stranded in snow : పాకిస్థాన్ లో అత్యంత ఘోరం జరిగింది. చూడటానికి అందంగా..ఆహ్లాదంగా కనిపించే మంచు 21మంది ప్రాణాల్ని తీసింది. వర్షంలా కురిసిన హిమపాతం 21మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. మంచుకురిసే వేళ ఎంత అందంగా మనస్సు పరవశించేలా ఉంటుందని అనుకుంటాం. అటువంటి హిమపాతం మనుషుల ప్రాణాల్ని బలిగొన్న విషాద ఘటన పాకిస్థాన్ లోని ముర్రీ పట్టణంలో చోటుచేసుకుంది.

Read more :Viresh Kumar Bhawra : ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. పంజాబ్ డీజీపీపై వేటు

వర్షంలా కురిసిన మంచులో కొన్ని కార్లు చిక్కుకుపోయాయి. ముందుకు గానీ వెనక్కి గాని కదలటానికి వీల్లేకుండా నిలిచిపోయాయి. ఆ హిమపాతానికి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి కార్లు కదలకుండా నిలిచిపోయాయి. ఆ కార్లలోఉన్నవారు చనిపోయారు. హిల్ స్టేషన్ ముర్రీ పట్టణంలో కురుస్తున్న హిమపాతపు అందాల్ని చూడటానికి వచ్చిన పర్యాటకులు చనిపోయిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది.

Read more :Pakistan Boat in Punjab : పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ బోట్ కలకలం..పరుగులు పెట్టిన బీఎస్‌ఎఫ్ అధికారులు

ముర్రీ పట్టణంలో మంచు భారీగా కురుస్తోంది. దాన్ని చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కానీ మంచు భీకరంగా కురవటంతో రోడ్డుమీదనే వాహనాలు కదలలేని స్థితిలో నిలిచిపోయాయి. అలా మంచులో చిక్కుకున్న కార్లలో ఉన్న 21మంది చలి తీవ్రత తట్టుకోలేకి ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని విపత్తు కలిగిన ప్రదేశంగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఇస్లామాబాద్, రావల్పిండి అధికారులు రెస్క్యూ ఆరేషన్ కొనసాగిస్తున్నారు. చనిపోయిన 21మంది పర్యాటకుల్లో 9మంది పిల్లలు కూడా ఉండటం మరింత బాధాకరం.

Read more :Teenagers Vaccination : 6 రోజుల్లో 2 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి

మంచుకురుస్తున్న అందాల్సి చూడటానికి వచ్చిన పర్యాటకులు కార్లలో వచ్చారు. ఏకధాటిగా కురుస్తున్న మంచుకు 1000 కార్లు రోడ్లమీదనే మంచులో చిక్కుకుపోయాయి. మంచు ఏకధాటిగా కురుస్తుండటంతో ఖైబర్ ఫక్తున్సా గెయిల్ యత్ కు కార్లు రాకుండా ఆపివేశారు.