Teenagers Vaccination : 6 రోజుల్లో 2 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి

భారత్ దేశ వ్యాప్తంగా 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా ఆరు రోజుల్లోనే 2కోట్లమందికి పైగా యువత వ్యాక్సిన్ తీసుకున్నారని మంత్రి తెలిపారు.

Teenagers Vaccination : 6 రోజుల్లో 2 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి

India Vaccination For Teenagers

India Vaccination for teenagers : కరోనా మహమ్మారిని నియంత్రించటానికి వచ్చిన వ్యాక్సిన్ యువతకు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ దేశ వ్యాప్తంగా టీనేజర్లు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంట్లో భాగంగా కేవలం ఆరు రోజుల్లోనే రెండు కోట్లమంది టీనేజర్లకు మొదటిడోసు వ్యాక్సిన్ వేశారు. ఆరు రోజుల్లోనే రెండు కోట్లకుపైగా టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

Read more : Telangana Vaccination : తెలంగాణలో 22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : మంత్రి హరీశ్ రావు

దేశ వ్యాప్తంగా జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది ఆరోగ్యశాఖ. ఆరోగ్య కార్యకర్తలు విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు. అలా ఆరు రోజుల్లోనే ధేశ వ్యాప్తంగా రెండు కోట్లమందిపైగా మొదటిడోసు వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు.

Read more :Double-Vaccinated: ఆ ట్రైన్ ఎక్కాలంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాల్సిందే

15-18 ఏళ్ల వారు మొదటి డోసు తీసుకున్నవారందరికి నాలుగు వారాల తరువాత రెండో డోసు వేస్తారు. అలా దేశ వ్యాప్తంగా ఉన్న టీనేజర్లకు వ్యాక్సిన్ ఇవ్వటానికి అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా..డిసెంబర్ 27న ప్రధాని మోడీ మాట్లాడుతు..దేశ వ్యాప్తంగా ఉన్న టీనేజర్లకు జనవరి 3 నుంచి వ్యాక్సిన్ అందజేస్తామని ప్రకటించిన క్రమంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Read more : COVID-19 Vaccine: భారత్ మరో విజయం.. తొలిరోజే 40 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్‌