Telangana Vaccination : తెలంగాణలో 22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్లవారికి వ్యాక్సిన్ వేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Telangana Vaccination : తెలంగాణలో 22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : మంత్రి హరీశ్ రావు

Vaccination Program For 15 To 18 Year Olds

Vaccination for 15 to 18 year olds in Telangana తెలంగాణలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యమంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కో వ్యాక్సిన్ ఇస్తున్నామని..22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్నామని..అదే జీహెచ్ ఎంసీ పరిధిలో 4.5 లక్షలమందికి వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని కాబట్టి ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతన్నాయని.. గత వారంలో పాజిటివిటీ రేట్ నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించారు.రాష్ట్రం తరపున కేంద్రాన్ని బుస్టర్ డోస్ గురించి చాలా కాలంగా కోరుతున్నామని… 15 నుంచి 18 ఏళ్లవారికి వ్యాక్సిన్ వేయటానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Read more : Delhi Police: ఢిల్లీ గల్లీల్లో పోలీస్, డ్రగ్ స్మగ్లర్స్ వార్, ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి

మొదటి డోసు వేసిన తరువాత నాలుగు వారాల వ్యవధిలో (28 రోజుల్లో) 2వ డోస్ టీకా ఇస్తామని..తల్లి తండ్రులు గానీ ఉపాధ్యాయుల సమక్షంలో టీనేజర్లకు టీకాలు అందిస్తామని తెలిపారు.
12 కార్పొరేషన్ లలో ఆన్ లైన్..ఇంకా ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు వేస్తామని..నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై మరో మారు నిర్ణయం తీసుకుంటామని..వ్యాక్సినేషన్ కోసం 1014 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలని..కాలేజీలో ప్రతి విద్యార్థి టీకా తీసుకునేలా కాలేజీ సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.ఖైరతాబాద్ ఆసుపత్రిని త్వరలో మరింత విస్తరించి ప్రారంభం చేస్తామని వెల్లడించారు. అవకాశం ఉంటే బంజారాహిల్స్ యుపిహెచ్ సి లో మెటర్నిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కరోనా తొలి రెండు వేవ్ లలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సమర్ధంగా పని చేశఆరని..థర్డ్ వేవ్ ఎదుర్కోవటానికి వైద్య సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

Read more : Visakha RK Beach: ఆర్కే బీచ్ లో గల్లంతైన యుకులకోసం రెండో రోజు గాలింపు

కరోనా వస్తే ప్రజలు ఎవ్వరు భయపడవద్దని దయచేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల్ని వినియోగించుకోవాలని.. ప్రైవేట్ అసపత్రులకు వెళ్లి ప్రజలు డబ్బు వృధా చేసుకోవద్దని కోరారు. ఎటువంటి లక్షణాలు ఉన్న అస్సత్రికి వచ్చి టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీజుకుంటే జ్వరం వస్తుందనే అపోహ వద్దని..అర్హులైనవారంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవటానికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్,కాలేజి ఐడి కార్డ్ ఉన్న సరిపోతుందని సూచించారు.