Pakistan Boat in Punjab : పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ బోట్ కలకలం..పరుగులు పెట్టిన బీఎస్‌ఎఫ్ అధికారులు
ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భద్రతా ఉల్లంఘన జరిగిన కొన్ని రోజలకే భారత్ లోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ కు చెందిన ఓ బోటు కలకలం రేపింది.

Pakistan boat tension in Punjab border:ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భద్రతా ఉల్లంఘన జరిగిన కొన్ని రోజలకే భారత్ లోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ కు చెందిన ఓ బోటు శుక్రవారం (జనవరి7,2022) తీవ్ర కలకలం సృష్టించింది. ఫిరోజ్ పూర్ సమీపంలో పాకిస్థాన్ కు చెందిన ఓ చెక్క పడవ ఉండటంతో భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. డాగ్ స్వాడ్ తో క్షణ్ణంగా పరిశీలించి దాన్ని (బీఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భద్రతా ఉల్లంఘన క్రమంలో ఈ బోటు కలకలం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
136వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది డీటీ మాల్ బార్డర్ ఔట్ పోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో సరిహద్దు ఔట్ పోస్టు సమీపంలో ఓ చెక్క బోటు కనిపించింది. దీంతో బీఎస్‌ఎఫ్ అధికారులు ఆందోళన చెందారు. బోటును అన్ని విధాలుగా క్షుణ్ణంగా తనిఖీలు చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా పరిశీలించారు. స్థానికులను పలు విధాలుగా ప్రశ్నించారు.ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు.
Read more : PM Modi: ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింతకు కారణం చెప్తున్న సీఎం చన్నీ
ఫిరోజ్‌పూర్ పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున సున్నితమైన జిల్లా. ఇటీవల కాలంలోనే పాకిస్థాన్ నుంచి అనేక డ్రోన్లు ఈ భూభాగంలోకి వచ్చాయి. కాగా పంజాబ్ పర్యటనలో భాగంగా భద్రతా లోపంతో ఫిరోజ్‌పూర్‌లోని ఓ వంతెనపై ప్రధాన మంత్రి కాన్వాయ్ 20 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ప్రధాని భద్రత అంశం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్ బోటును గుర్తించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
పంజాబ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన క్రమంలో ప్రధాని కాన్వాయి భత్రతా ఉల్లంఘన..పంజాబ్ సరిహద్దుల్లోనే పాకిస్థాన్ బోటు కనిపించటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
Read more : PM Modi Convoy : ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం..ఏడాది క్రితమే పక్కా ప్లాన్!
గత డిసెంబర్ లో పంజాబ్‌లో లూథియాన కోర్టులో పేలుడు సంభవించటం వంటి పలు ఘటనలు పలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ పేలుళ్ల కేసు దర్యాప్తు సందర్భంగా ఇంటెలిజెన్స్ వర్గాలు పలు హెచ్చరికలు చేశాయి. ముఖ్యంగా కశ్మీర్‌లో భద్రత ఎక్కువగా ఉండడంతో ఉగ్రవాదులు పంజాబ్‌ను టార్గెట్ చేసుకున్నారనే ఇంటిలిజెన్స్ సమాచారంతో సంబంధిత అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు.
Read more : PM Modi: సీఎంకు థ్యాంక్స్.. ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో వచ్చా- ప్రధాని మోదీ
చిన్న విషయాల్లో కూడా లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఏది కనిపించినా అధికారులు అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే పంజాబ్ సరిహద్దుల్లో బోటు విషయంలో బీఎస్ఎఫ్ అధికారులు అత్యంత జాగ్రత్తతో పరిశీలించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా..ఇటువంటి బోటులను మాదకద్రవ్యాల రవాణాకు వినియోగిస్తారని అధికారులు వెల్లడించారు.
- Mystery: వీడిన 160ఏళ్ల మిస్టరీ .. పాడుబడ్డ బావిలో పుర్రెలెవరివో తేలింది..
- Arvind Kejriwal On Karnataka : ఢిల్లీ, పంజాబ్ తరహాలోనే కర్నాటకలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం-కేజ్రీవాల్
- Punjab: గుడిసెకు నిప్పంటుకుని ఏడుగురు మృతి
- Ram Charan : స్పెషల్ ఫుడ్ వండించి, టైం కేటాయించి.. పంజాబ్‌లో సోల్జర్స్‌తో చరణ్..
- Punjab CM Mann: అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్న పంజాబ్ కొత్త సీఎం
1Telangana : గులాబీకి షాక్..కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..!
2Accident: ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..
3Disha Encounter: ‘దిశ’ కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన రేపే..
4Rajya sabha : యూపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేత..మురళీధర్ రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ హైకమాండ్
5AP Politics : ‘YCP ట్రాప్ లో పడొద్దు..టీడీపీతో పొత్తే బెటర్’అంటూ జనసేనానికి హరిరామజోగయ్య లెటర్
6Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
7Taliban Promise: ఇదేనట గుడ్ న్యూస్.. కొంటె మహిళలను ఇళ్లలోనే ఉంచుతామంటోన్న తాలిబాన్లు
8KA PAUL : వరుస మీటింగ్‌లతో జోరు పెంచిన పాల్..అమిత్ షాతో భేటీ వెనుక పెద్ద కథే ఉందంట..!
9Malavika Mohanan : విజయదేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలి అంటున్న తమిళ హీరోయిన్
10CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
-
father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
-
Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన