PM Modi: ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింతకు కారణం చెప్తున్న సీఎం చన్నీ

రెండేళ్ల తర్వాత పంజాబ్ లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజీ పూర్ జిల్లాలో రోడ్డుపై వెళ్తున్న ప్రధాని కాన్వాయ్ ని నిరసన కారులు అడ్డుకున్నారు.

PM Modi: ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింతకు కారణం చెప్తున్న సీఎం చన్నీ

Punjab Cm

PM Modi: రెండేళ్ల తర్వాత పంజాబ్ లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజీ పూర్ జిల్లాలో రోడ్డుపై వెళ్తున్న ప్రధాని కాన్వాయ్ ని నిరసన కారులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని తిరిగి బటిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. పర్యటన రద్దుపై అసహనం వ్యక్తం చేసిన మోదీ.. ‘మీ సీఎంకు థ్యాంక్స్ చెప్పండి. బటిండా ఎయిర్‌‌పోర్టు వరకూ ప్రాణాలతో రాగలిగా’ అంటూ సెటైర్ వేశారు.

దీనిపై పంజాబ్ సీఎం చన్నీ రెస్పాండ్ అయ్యారు. ఇందులో ఎటువంటి భద్రతా వైఫల్యం లేదని, 10వేల మంది పోలీసులతో పటిష్ఠ సెక్యూరిటీ చేశామన్నారు. కాకపోతే ప్రధాని హెలికాప్టర్ లో రావాల్సి ఉండగా, ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని అదే సమస్యకు కారణమైందన్నారు. అప్పటికీ ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను తప్పుకోవాలని స్వయంగా అభ్యర్థించినట్లు చెప్పారు.

ఈ ఘటనపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ తిట్టిపోస్తున్నారు. దేశ ప్రధానికే సునాయాస ప్రయాణాన్ని అందించలేనప్పుడు సామాన్య ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 10 కి.మీ దూరంలో ఉన్నపుడు ప్రధాని సెక్యురిటీ విషయంలో అశ్రద్ధ వహించారని, పదవిలో కొనసాగే హక్కు ముఖ్యమంత్రికి లేదని, సీఎం వెంటనే పదవీ విరమణ చేయాలని అమరీందర్ సింగ్ అన్నారు.

ఇంకా చదవండి: అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకింకా 29 ఏళ్లే!

అసలేం జరిగింది:
రూ.42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులను పంజాబ్ లో మోదీ ప్రారంభించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటం, వర్షం పడుతుండటంతో.. రోడ్డు మార్గంలో హుస్సేనివాలాకు బయల్దేరారు మోదీ. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకం దగ్గర నివాళులర్పించి.. ఫిరోజీపూర్ లో బహిరంగ సభకు వెళ్లాలని భావించారు. స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ప్రధాని కాన్వాయ్ కు నిరసన సెగ తగిలింది.