సరదా తీరిపోయింది : అటువంటి మాస్కు పెట్టుకున్నాడని అరెస్ట్

Pak man atrrested for Wolf Mask : ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వేడుకలు పాతకరోనా..కొత్త కరోనా కోరల మధ్యనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వాలు పలు నిబంధనలు విధించాయి. కానీ జనాలు పాటిస్తున్నారా లేదా అనేది మాత్రం పెద్ద ప్రశ్నే. ఈక్రమంలో పాకిస్థాన్ లో ఓ వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలకు సరదాగా ఓ వెరైటీ మాస్కు వేసుకుని వచ్చాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.
పాకిస్థాన్లోని పెషావర్లో నూతన సంవత్సరం వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకలకు ఓ వ్యక్తి కరోనా బారిన పడకుండా జాగ్రత్త కోసం కాకుండా నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నవారిని సరదాగా భయపెట్టాలని అనుకున్నాడు. 2020లో చివరి రోజు ప్రజలపై ప్రాంక్ చేయాలనుకున్నాడు.
దాని కోసం ఓ ప్లాన్ వేశాడు. తోడేలులా ఉండే ఓ మాస్కును ముఖానికి వేసుకొని వీధుల్లోకి వచ్చాడు. ఆ మాస్కు పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తిని చూసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని ఒమర్ ఖురేషీ అనే పాకిస్థాన్ జర్నలిస్టు ట్విట్టర్లో ఫొటోతో సహా ట్వీట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. తోడేలు మాస్కు ధరించిన వ్యక్తితో పాటు పోలీసులు కూడా ఆ ఫొటోలు ఉన్నారు.
అయితే సరదాగా మాస్కు వేసుకున్న అతడిని పోలీసులు అరెస్టు చేయడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు మాస్కు పెట్టుకోకుండా రాకపోతే అరెస్ట్ చేయాలి కానీ ఏదో సరదాకోసం చేస్తే ఇలా అరెస్ట్ చేయటమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.
Police in the Pakistani city of Peshawar arrest a young man on New Year’s eve – for wearing a costume mask to scare people pic.twitter.com/sU9f1NDcAf
— omar r quraishi (@omar_quraishi) January 1, 2021