South Korea Plane : విమానం గాలిలో ఉండగా డోర్ తెరిచిన ప్రయాణికుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఏ 321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు ఆ విమానం డోర్ తెరిచాడు. అయితే, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా డోర్ కొద్దిగా తెరుచుకుంది.
- bheemraj
- Published On : May 26, 2023 / 04:13 PM IST
South Korea Plane
Plane Door Open : దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమాన డోర్ ను ఓ ప్రయాణికుడు తెరిచాడు. ఆ సమయంలో విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానాన్ని డేగు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరుగలేదు.
ఏ 321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు ఆ విమానం డోర్ తెరిచాడు. అయితే, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా డోర్ కొద్దిగా తెరుచుకుంది. దక్షిణ దీవి జేజూ నుంచి డేగా వెళ్తోన్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Air India Flight Fire : ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
విమానంలోని 194 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఎంత సమయం డోర్ తెరిచారన్న అంశంపై స్పష్టత రాలేదు. కాగా, విమానం డోర్ తెరిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఎందుకు డోర్ తెరిచాడో ఇంకా నిర్ధారణ కాలేదు.
అయితే, ఉల్సన్ లో జరుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గోనేందుకు చాలా మంది అథ్లెట్లు విమానంలో ప్రయాణిస్తున్నారు. డోర్ తెరిచిన కారణంగా శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తిన పలువురు ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు రవాణా శాఖ తెలిపింది.
