చరిత్రలో కఠినంగా శ్రమించే ప్రెసిడెంట్‌ను నేనే: డొనాల్డ్ ట్రంప్

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 07:17 AM IST
చరిత్రలో కఠినంగా శ్రమించే ప్రెసిడెంట్‌ను నేనే: డొనాల్డ్ ట్రంప్

Updated On : April 29, 2020 / 7:17 AM IST

మీడియా మీద మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తనను కఠినంగా పనిచేసే ప్రెసిడెంట్ అని అంటారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంట. పదవీ కాలంలో ఆయన పనిచేసినంతగా చరిత్రలో మరెవ్వరూ చేయలేదని కామెంట్ చేశారు. 

‘నేను తెలిసిన ప్రజలకు, మన దేశ చరిత్ర తెలిసిన వాళ్లకు తెలుస్తుంది నేనెంత కష్టపడి పనిచేస్తున్నాననేది. అది నాకు తెలియదు. కానీ, నేను పదవిలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఏ ప్రెసిడెంట్ చేయలేనంతగా పనిపచేశాను. ఫేక్ న్యూస్ నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశాడు. 

మరో ట్వీట్‌లో తెల్లవారకముందు నుంచే పని మొదలుపెట్టి అర్ధరాత్రి వరకూ పని చేసుకుంటా. చాలా నెలలుగా వైట్ హౌజ్ ను వదిలి పెట్టి బయటకు పోలేదు. ట్రేడ్ డీల్స్, మిలటరీ రీ బిల్డింగ్ వంటి పనులు చేసినప్పుడు న్యూయార్క్ టైమ్స్ లో నా గురించి స్టోరీ కూడా రాసుకొచ్చారు

మీడియాను విమర్శిస్తూ.. ప్రతి ఒక్కరిపైనా చట్టపరమైన శిక్షలు అమలయ్యేలా చూస్తాం. ఎవరైనా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే.. అన్యాయాన్ని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. మనకోసం గొప్ప గొప్ప న్యాయవాదులు పనిచేస్తున్నారు. నోబెల్ కమిటీ చట్టం కింద ఎప్పుడు పనిచేయగలం? త్వరగా చేస్తే మంచిది!అని అన్నారు. 

అమెరికా ప్రెసిడెంట్ అతనిపై వచ్చిన తప్పుడు వార్తలకు సీరియస్ అవుతూనే నిజాలపై వివరణ ఇచ్చారు.