40days isolation in Dark cave : చీకటి గుహలో 40 రోజులు 15మంది ఐసోలేషన్‌..లైట్లు ల్లేవు..ఫోనుల్లేవు.. టైమే తెలీదు..

people spent 40 days in voluntary isolation : ఐసోలేషన్‌..ఈ కరోనా కాలంలో వినిపించే మాట. కరోనా సోకి ఐసోలేషన్‌ లోకి వెళ్లారు అనే మాట వింటున్నాం. కానీ ఓ 15మంది మాత్రం కరోనా రాకుండానే ఐసోలేషన్‌ లో ఉన్నారు. అదికూడా చీకటి గుహలో..ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 40 రోజుల పాటు ఐసోలేషన్‌ ఉన్నారు. అలా ఉన్నవారి దగ్గర ఫోన్ లేదు. టైమ్ ఎంతో తెలుసుకోవటానికి వాచ్ లేదు. అసలు లైట్లు కూడా లేవు. ఫ్రాన్స్‌లో బైట ప్రపంచంతో వారికి ఎటువంటి సంబందాలు లేకుండా..కటిక చీకటిలో 40 రోజుల పాటు 15మంది ఐసోలేషన్‌ లో ఉన్నారు. వీరిలో 8మంది పురుషులు కాగా 7గురు మహిళలు ఉన్నారు.

వీరంతా చీకటి గుహలో ఐసోలేషన్‌లో ఉన్నది కరోనా వైరస్ సోకి కాదు..మరే భయంతోను కూడా కాదు. ఓ ప్రయోగం కోసం వారంతా చీకటిలో 40 రోజులు ఉన్నారు. పైరినీస్ పర్వత ప్రాంతాల్లో ఉన్న అత్యంత లోతైన చీకటి గుహలో కనీసం లైట్లు కూడా లేకుండా ఉన్నారు. గుహలో ఉన్నంత సేపు తమకు అలసటగా అనిపించలేదని, చాలా చలిగా అనిపించిందని వీరు తెలిపారు.

గుహలో చీకటితోపాటు 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవని..తేమ 100 శాతం ఉందన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధం లేకుండా 40 పగలు, 40 రాత్రులు గుహలో గడిపారని పరిశోధకులు తెలిపారు. అలా 40 రోజులు పూర్తి అయ్యాక వీరు బైట ప్రపంచంలోకి వచ్చారు. వెలుగులోకి వచ్చాక వారు తిరిగి వెలుగు అలవాటు అయ్యేంత వరకూ వీరికి ప్రత్యేకమైన కళ్లజోళ్లు ఇచ్చారు.

హ్యూమన్ అడాప్షన్ ఇనిస్ట్యూట్ నిర్వహించిన ఈ వినూత్న పరిశోధన ద్వారా చీకటి గుహలో ఉన్నవీరంతా.. కరోనా వైరస్ వల్ల చాలామంది ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉంటున్నారని..అటువంటి పరిస్థితుల్లో ఐసోలేషన్ లో ఉన్నవారి మానసిక స్థితి.. అలవాట్లు ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.

చీకటి గుహలో ఉండటం వల్ల వారంతా రాత్రి, పగలు తేడా తెలియకుండా గడిపారని తెలిపారు. వారు కేవలం నిద్రపోయే సమయాలు ఆధారంగా రోజులు లెక్కబెట్టుకున్నారనీ..40 రోజులు గడిచినా.. వారిలో చాలామంది ఇంకా పది రోజులు సమయం ఉందని భావించారని తెలిపారు. అందరూ ఆరోగ్యంతో తిరిగి బయటకు వచ్చారని..ఇది ఓ వినూత్నమైన పరిశోధన అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు