ప్రపంచవ్యాప్ంగా కరోనా కరాళ నృత్యానికి చిగురుటాకుల్లా రాలిపోతున్నారు ప్రజలు.. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా చాలావరకు దేశాలు.. లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే మన దేశంలాగే మిగిలిన దేశాల్లో కూడా ప్రభుత్వం ఆదేశాలను భేఖాతరు చేస్తూ బయట తిరుగుతున్నారు. ఈ పరిస్థితి ప్రతి దేశంలో తలనోప్పిగా తయారవగా.. ఈ సమయంలో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతరు చేస్తున్న వారిపై ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా భావిస్తున్నట్లు న్. ఇక ప్రభుత్వ ఆదేశాలను పెడచెవినపెట్టి కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నవారి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని సహించేది లేదని, వారిని కాల్చి చంపండి అంటూ రోడ్రిగో పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించారు ఆ దేశ అధ్యక్షుడు.
ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని రోడ్రిగో డ్యూటెర్టే కోరారు. అయితే మానవ హక్కుల కార్యకర్తలతోపాటూ, నెటిజన్లు అధ్యక్షుడి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో కరోనా తీవ్రత దృష్ట్యా దేశాధ్యక్షుడు అలా మాట్లాడారే తప్ప ఆదేశాలు మాత్రం లేవని ఫిలిఫ్పీన్స్ పోలీసు చీఫ్ స్పష్టం చేశారు.
Also Read | రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన భారతి సిమెంట్స్