Pizza Party In Space : అంతరిక్షంలో పిజ్జా పార్టీ.. వీడియో వైరల్

అంతరిక్షంలో వ్యోమగాములు పిజ్జా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Astronauts Pizza party in space : అంతరిక్షంలో వ్యోమగాములు పిజ్జా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమికి దూరంగా 400 కిలోమీటర్ట దూరం ప్రయాణించిన వ్యోమగామ బృందం అంతరిక్షంలో స్నేహితులతో కలిసి తేలియాడే పిజ్జా పార్టీని ఎంజాయ్ చేశారు. అంత‌రిక్షంలోని స్పేస్ స్టేష‌న్ల‌లో రోజులు కాదు.. నెల‌ల కొద్దీ గడిపేలా సైంటిస్టులు వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే వేదికను పిజ్జా నైట్ కోసం వినియోగించుకున్నారు.

ఈ వీడియోను ఫ్రెంచ్‌ ఆస్ట్రోనాట్‌.. థామస్ పెస్క్వెట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్ గా మారింది. అంతరిక్షంలో ఉన్నామనే ఫీలింగ్ లేదని.. భూమిపై జరుపుకునే వీకెండ్ పార్టీలానే అనిపించిందంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. జీరో గ్రావిటీ ఉన్న అంతరిక్షంలో ఏ వస్తువు అయినా తేలియాడుతుంది.

వ్యోమగాములు పార్టీ చేసుకునే పిజ్జా కూడా ఎగురుతోంది. స్పేస్ షిప్ లో గాల్లో ఎగురుతున్న పిజ్జాలను అందుకుని నోటితో పట్టుకుని తింటున్నారు. పిజ్జాలతో పాటు వారు తిరుగుతూ వాటిని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటం వీడియోలో చూడొచ్చు.  ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలో థామస్.. జీరో-గురుత్వాకర్షణ వాతావరణంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన తోటి వ్యోమగాములతో కలిసి పిజ్జా తింటున్నట్లు కనిపిస్తోంది. అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 7లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌ రాగా..1.3 లక్షల మంది లైక్ చేసారు. ఈ వీడియో చూసి ఇన్ స్టా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. వ్యోమగామి బృందానికి తమ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మీరు భూమికి తిరిగి వచ్చిన తర్వాత.. మీరు టేబుల్ మీద ఆహారాన్ని ఉంచడం మర్చిపోవచ్చు అని ఒక యూజర్ అన్నాడు. మరో యూజర్ మేము నిన్న రాత్రి పిజ్జా పార్టీ కూడా చేశాము కానీ అవి పైకి ఎగరలేదంటూ సరదాగా కామెంట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు