PM Modi : నా ప్రియమైన మిత్రమా.. అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ అభినందనలు.. మళ్లీ కలిసి పనిచేద్దాం..!

PM Modi : మై డియర్ ఫ్రెండ్ ట్రంప్.. మరోసారి సన్నిహితంగా పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

PM Modi congratulates dear friend Trump

PM Modi : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రసంగించిన ట్రంప్.. ఈ సమయం నుంచి అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని అన్నారు. నా హయాంలో ప్రతి నిర్ణయమూ ‘అమెరికా ఫస్ట్‌’ను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటానని చెప్పారు. మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ట్రంప్ అన్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాను దుర్వినియోగం చేయదు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ప్రపంచ దేశాధినేతలు ఆయనకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also : Donald Trump Speech : అధ్యక్షుడిగా ట్రంప్ ఫస్ట్ స్పీచ్.. అమెరికాలో స్వర్ణయుగం ప్రారంభమైంది.. ఇంకా ఏమన్నారంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో ట్రంప్‌ను అభినందిస్తూ.. ‘నా ప్రియమైన మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. అమెరికా 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకార దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చడానికి, ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి మళ్లీ కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. మీ విజయవంతమైన పదవీకాలం కోసం మీకు శుభాకాంక్షలు అంటూ మోదీ ఎక్స్ పోస్టులో తెలియజేశారు.

PM Modi

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ కూడా ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. యూకే, యుఎస్‌ల మధ్య ప్రత్యేక సంబంధాలు రాబోయే సంవత్సరాల వరకు వృద్ధి చెందుతాయని నేను విశ్వసిస్తున్నాను.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ కూడా ట్రంప్‌ను అభినందిస్తూ.. ‘అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌, అమెరికన్ ప్రజలను అభినందిస్తున్నాను. ఈ రోజు మార్పు రోజు, ప్రపంచ సవాళ్లతో సహా అనేక సమస్యలకు పరిష్కారాలను అందించే మంచిరోజుగా పేర్కొన్నారు.

Read Also : Donald Trump Oath Ceremony : ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు.. హాజరైన అతిథులు వీరే..!