Modi2
PM Modi ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు జీ-20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధాని మోదీ రోమ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం జీ-20 సదస్సు రెండో రోజులో భాగంగా రోమ్‌లోని ప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్‌కు మోదీ వెళ్లారు.
పలు ప్రపంచ దేశాధినేతలతో కలిసి ట్రెవీ ఫౌంటెయిన్‌కు వెళ్లిన మోదీ..వెనుకకు తిరిగి అక్కడి నీటిలో ఓ నాణెం విసిరారు. అలా భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్ వెళ్తారని ప్రజల నమ్మకం. దీంతో మోదీ కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.
కాగా,ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫౌంటెయిన్లలో ట్రెవీ ఒకటి. చక్కటి శిల్పకళా నైపుణ్యం దీని సొంతం. ట్రెవీ ఫౌంటెయిన్ సందర్శన సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్‌తో మోదీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.
ALSO READ Ajay Misra : కేంద్రమంత్రి మిశ్రా కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి