PM Modi US Tour : 30 ఏళ్ల క్రితం ఓ సామాన్యుడిలా వైట్ హౌస్‌ను బయట నుంచి చూసా: ప్రధాని మోదీ
ఓ సామాన్యుడిలా అమెరికా వచ్చినప్పుడు వైట్ హౌస్ ను బయటనుంచి చూశాను..ఇప్పుడు అదే వైట్ హౌస్ లో నాకు ఇంతటి ఆదరణ లభించటం భారతీయులకు లభించిన గౌరవం.

PM Modi US Tour
PM Modi America Tour : అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్రమోదీకి.. విశేష ఆదరణ లభిస్తోంది. వైట్ హౌజ్‌లో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ దంపతుల నుంచి ఘన స్వాగతం లభించింది. మోదీకి బైడెన్ దంపతులు ప్రత్యేక విందు ఇచ్చారు. ఇలా అమెరికాలో భారత ప్రధానికి అరుదైన గౌరవాభిమానాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో మోదీ జోబైడెన్ తో కలిసి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బైడన్ ఇచ్చిన ఆదర స్వాగతానికి.. ఆత్మీయ విందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. నాకు లభించిన ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు.. అమెరికాలో ఉన్న భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
ఆ తరువాత 30 ఏళ్ల క్రితం ఓ సామాన్యుడిలా వైట్ హౌస్ ను బయట నుంచి చూశానని గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం తాను ఓ సామాన్యుడిలా అమెరికా పర్యటనకు వచ్చానని..అప్పుడు బయటనుంచి వైట్ హౌస్ ను చూశానని గుర్తు చేసుకున్నారు. తాను ప్రధాని అయ్యాక కూడా పలుసార్లు అమెరికా వచ్చాను.. కానీ ఇప్పటి రాక చాలా ప్రత్యేకమైనదన్నారు. ఇంత భారీ ఎత్తున తనకు జనాలు స్వాగతం పలికారని.. కొంతమంది అయితే ప్రత్యేకంగా తనపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించారని అన్నారు. ఈ సారి తన అమెరికా పర్యటనలో చాలా విశేషాలను చూశానని.. పెద్ద ఎత్తున ప్రజలు అభినందనలతో స్వాగతం పలకటం, ఆ ఆనందంతో వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయంటూ మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు.
Modi no.1: మళ్లీ మళ్లీ మోదీనే.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్‌గా ప్రధాని మోదీ
అమెరికాలో ఉన్న ఎన్నారైలు భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని ప్రశంసించారు. భారతీయులకు అంకితభావం ఎక్కువన్నారు. అదే అంకిత భావంతో.. నైపుణ్యం, నిబద్ధతతో పనిచేసి భారతదేశ గౌరవ ప్రతిష్టలను పెంచుతున్నారంటూ కొనియాడారు. భారత్, అమెరికా దేశాల వ్యవస్థలు, సంస్థలు, ప్రజాస్వామ్య పునాదులపైనే నిర్మితమై కొనసాగుతున్నాయన్నారు. రెండు దేశాల ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల కోసం.. వారి సంక్షేం కోసమే పనిచేస్తున్నాయన్నారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం అని కీర్తించారు.
కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతుల ఆహ్వానం మేరకు జూన్ 21-24 తేదీల మధ్య ఆయన USలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం (international yoga day) సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం (జూన్ 21) న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 180 దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో యోగా సెషన్ లో అత్యధిక జాతీయులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు సాధించింది.
US lawmakers selfies with PM Modi: మోదీతో సెల్ఫీలు,ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీ పడిన అమెరికా చట్టసభ సభ్యులు