PM Modi receives grand welcome: న్యూయార్క్ చేరుకున్న మోదీకి ఘనస్వాగతం

మూడు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఆయనకు భారతీయ సమాజం ఘన స్వాగతం పలికింది.....

మోదీకి ఘనస్వాగతం పలికిన భారతీయులు

PM Modi receives grand welcome: మూడు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఆయనకు భారతీయ సమాజం ఘన స్వాగతం పలికింది.(PM Modi US Visit 2023)విమానాశ్రయంలో ఆయన రాక సందర్భంగా ‘‘మోదీ మోదీ’’ నినాదాలు ప్రతిధ్వనించాయి.ప్రధాని మోదీ అమెరికా దేశ పర్యటన కోసం బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరారు.(lands in New York) ఆయనకు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

న్యూయార్క్‌లో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్

న్యూయార్క్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి భారతీయులు భారీ స్వాగతం పలికారు. కొందరు మోదీతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. మరికొందరు ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు యత్నించారు.విమానాశ్రయం నుంచి న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌కు ప్రధాని వచ్చారు. తనకు స్వాగతం పలికేందుకు హోటల్ వెలుపల గుమికూడి ఉన్న భారీ జనసమూహం వైపు మోదీ చేతులు ఊపారు.ఆదివారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ ,శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద పలువురు భారతీయ సమాజ సభ్యులు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపు

జూన్ 21-24 తేదీల మధ్య మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. ప్రధానిగా తొమ్మిదేళ్ల పాలనలో మోదీ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతన్ని ఆహ్వానించారు, వారు జూన్ 22న మోదీకి విందు ఇవ్వనున్నారు.రక్షణ పరిశ్రమలో సహకారం. ఉన్నత సాంకేతికతను పంచుకోవడంతో మోదీ పర్యటన అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపుగా కూడా పరిగణిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు