విషాదం : మధ్యదరా సముద్రంలో పడవల మునక

  • Publish Date - January 21, 2019 / 02:34 AM IST

ఢిల్లీ : మధ్యదరా సముద్రంలో మూడు పడవలు మునిగిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 170 మంది గల్లంతయ్యారని మైగ్రేషన్ అధికారులు పేర్కొంటున్నారు. లిబియా సరిహద్దుల్లో మధ్యదరా సముద్రంలో పడవలు మునిగిపోవడంతో 117 మంది గల్లంతయ్యారని ఇటలీ నావికదళం వెల్లడించింది. లిబియాలోని గారాబుల్లే రేవు నుంచి పడవ బయలుదేరింది. పది గంటల తరువాత ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. మరో పడవ మొరాకో నుంచి బయలుదేరి మధ్యదరా సముద్రానికి పశ్చిమాన అలబోరన్ సముద్ర తీరంలో మునిగిపోవడంతో 53 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. లిబియాలోని జువారి తీరంలో మరో పడవ ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 47 మందిని స్థానిక ఈతగాళ్లు రక్షించినట్టు సమాచారం. నిత్యం ఘర్షణల మధ్య రగిలే లిబియాలో వలసవాదులు సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు ఇలా పడవ ప్రయాణాలను ఆశ్రయించడం, ప్రమాదాలు జరగడం మామూలైపోయింది. అలా మధ్యధరా సముద్రంలో గత ఏడాది ఇలా పడవ ప్రమాదాల్లో 2200మంది చనిపోయారని అంచనా.