పోర్చుగల్ ఐస్ ల్యాండ్ లోని మడైరాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 30నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
అ ప్రమాదంలో 29మంది చనిపోగా.. మరో 28మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో జర్మనీ దేశానికి చెందిన టూరిస్టులు ఎక్కువగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నారు. కానికో అనే ప్రదేశం వద్ద ఎక్కువ మలుపు ఉండగా.. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక మేయర్ తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.