Portugal Health Minister Resigns : భారత్‌కు చెందిన గర్భిణి మృతి .. పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా
భారత్ కు చెందిన గర్భిణి మృతి చెందటంతో పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.

Portugal health minister resigns
Portugal health minister resigns after pregnant Indian tourist dies : భారత్ కు చెందిన గర్భిణి మృతి చెందటంతో పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా టీకా వేయించడంలో మార్టా విజయం సాధించి మంచి పేరు సంపాదించుకున్నారు. అటువంటి ఆరోగ్యమంత్రి గర్భంతో ఉన్న భారత్ పర్యాటకురాలు సరైన వైద్యం అందక గుండెపోటుతో మృతి చెందంటతో నైతిక బాధ్యతవహిస్తూ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.
లిస్బన్‌లోని ప్రధాన ఆసుపత్రి అయిన శాంటియా మారియా ఆసుపత్రిలోని నియోనాటాలాజీ విభాగం కిక్కిరిసిపోవడంతో 34 ఏళ్ల భారతీయ గర్భిణిని అక్కడి నుంచి అంబులెన్స్‌లో మరో ఆస్పత్రికి తరలించారు. అలా పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుండగా ఆమె గుండెపోటుకు గురి అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె మరణించారు. దీంతో అత్యవసరంగా సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. లిస్బన్ లో జరిగిన ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ..భారత్ పర్యాటకురాలి మృతిపై ప్రభుత్వం విచారణకు
ఈ క్రమంలో ఆమె మరణించిన కొద్దిసేపటికే ఆరోగ్య మంత్రి మార్టా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. టెమిడో తనపదవికి రాజీనామా చేస్తూ ఇకపై షరతులు లేవు అని పేర్కొన్నారు. ఆమె రాజీనామాను ప్రధాని అంటోనియో కోస్టా అంగీకరించారు. ఈ విషయాన్ని పోర్చుగల నేషనల్ పబ్లిక్ బ్రాడక్ కాస్టర్ RTP న్యూస్ వెల్లడించింది.
కరోనా సమయంలో దేశవ్యాప్తంగా టీకా వేయించడంలో మార్టా విజయం సాధించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే వైద్యులు అందుబాటులో లేకపోవటంతో అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయాలన్నమంత్రి టెమిడో నిర్ణయించారు. ఆమె నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ప్రధాని అంటోనియో మాత్రం ఆరోగ్య శాఖా మంత్రిగా టెబిడో మంచి పేరు సంపాదించుకున్నారని..ముఖ్యంగా మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేశారని కొనియాడారు.
కాగా..ఆసుపత్రుల్లోని ప్రసూతి యూనిట్లు నిండిపోతుండడంతో గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కారణంతోనే అంబులెన్స్ లో భారతీయ పర్యాటకురాలిని ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో ఆమె మరణించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోగ్య మంత్రి మార్టాపై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రభుత్వం చేతకానితనంతో భారత పర్యాటకురాలి ప్రాణాలు పోయాయని విమర్శనాస్త్రాలు సంధించాయి. ఈ క్రమంలో ర్యాటకురాలి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మార్టా రాజీనామా చేశారు.