Powerlifting Grandma : 30ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడే సూపర్ ఫిట్.. పవర్ లిఫ్టింగ్ గ్రాండ్ మా మేరీ డఫీ

సాధారణంగా వయసు మీద పడ్డాక.. వృద్ధులు... ఏం చేస్తారు. రామకృష్ణ అంటూ ఓ మూలన ఉంటూ కాలం వెళ్లదీస్తారు. గుళ్లూ, గోపురాలు తిరుగుతూనో బుక్కులు చదువుతూనో కాలక్షేపం చేస్తారు. జీవితానికి ఇది చాలనుకుంటారు. కానీ, మేరీ డఫీ అలాంటి వ్యక్తి కాదు. 70ఏళ్ల వయసులోనూ

Powerlifting grandma Mary Duffy : సాధారణంగా వయసు మీద పడ్డాక.. వృద్ధులు… ఏం చేస్తారు. రామకృష్ణ అంటూ ఓ మూలన ఉంటూ కాలం వెళ్లదీస్తారు. గుళ్లూ, గోపురాలు తిరుగుతూనో బుక్కులు చదువుతూనో కాలక్షేపం చేస్తారు. జీవితానికి ఇది చాలనుకుంటారు. కానీ, మేరీ డఫీ అలాంటి వ్యక్తి కాదు. 70ఏళ్ల వయసులోనూ జిమ్ లో కసరత్తులు చేస్తుంది. బాడీని ఫిట్ గా ఉంచుకుంటుది. వారంలో 20 గంటలు ఎక్సర్ సైజులకు సమయం కేటాయిస్తుంది. అలవోకగా బరువులు ఎత్తేస్తుంది.

అందుకే మేరీ డఫీ.. వరల్ట్ టఫెస్ట్ గ్రాండ్ మా గా గుర్తింపు పొందింది. 59ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. బరువు తగ్గాలనే ఆలోచన వచ్చింది. అందుకు శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. వెయిట్ లిఫ్టింగ్ వైపు మళ్లింది. ప్రస్తుతం పవర్ లిఫ్టింగ్ లో తనకంటూ గుర్తింపు పొందింది.

7 పదుల వయసులోనూ ఆమె ఎంతో సునాయసంగా బరువులు ఎత్తుతుంది. ఈ క్రమంలో ఎన్నో వరల్డ్ రికార్డులు నెలకొల్పింది. చిన్న ఏనుగు ఉండే బరువు కన్నా ఎక్కువ(250lb) బరువు ఎత్తి రికార్డు నెలకొల్పింది.

”పదేళ్ల క్రితం జిమ్ కి వెళ్లడం స్టార్ట్ చేశారు. బరువు తగ్గినట్టు అనిపించింది. ఆ తర్వాత అద్దంలో చూసుకుంటే.. ఇది నేనేనా అనిపించింది. చాలా త్వరగానే బరువు తగ్గాను. ఎంత ఎక్కువ శిక్షణ తీసుకుంటే అంత ఎంజాయ్ గా ఉంది. ఇప్పుడు నా వయసు 71. ఎంతో ఫిట్ గా ఉన్నా. 40 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడే ఎంతో ఫీట్ గా ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతోంది” అని మేరీ డఫీ అంటుంది.

2014లో మేరీ తొలిసారి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అప్పుడు ఆమె వయసు 64ఏళ్లు. వెయిట్ లిఫ్టింగ్ లో ఇప్పటివరకు అనేక వరల్డ్ రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు మేరీ వారానికి మూడు ఫిట్ నెస్ క్యాంపులు, రెండు పర్సనల్ ట్రైనింగ్ సెషన్లు ఇస్తుంది. అంతేకాదు తన ఫిట్ నెస్ ప్రొగ్రెస్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తుంది. ఈ వయసులో వెయిట్ లిఫ్టింగ్ చేయడం మంచిది కాదని చాలామంది నాతో చెబుతారు. అలా చెబితే నాకు నవ్వు వస్తుంది. నా గత రికార్డులు ఒకసారి చూడాలని చెబుతాను అని మేరీ అంటుంది.

”ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ వయసులో ఎందుకింత కష్టపడుతున్నానని.. కానీ, కొందరు వ్యక్తుల పాజిటివ్ కామెంట్స్ నన్ను ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నాయి. 70ఏళ్ల బామ్మలా కనిపించాలని నేను అస్సలు అనుకోను. పవర్ లిఫ్టింగ్ నుంచి క్విట్ అవుతాను అని నేను అనుకోవడం లేదు. ఒక వేళ పోటీల్లో పాల్గొనడం ఆపేస్తే.. నా బాడీ షేప్ ని ఇలానే ఉంచుకోవడానికి వర్కౌట్స్ చేస్తూనే ఉంటాను” అని మేరీ అంటుంది.

ట్రెండింగ్ వార్తలు