Kim Jong-un : కిమ్ మరో వింత నిర్ణయం : పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశం

వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రగ్ గా ఉండే నార్త్ కొరియా నియంత్ర కిమ్ మరో వింత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చేయాలని ఆదేశించారు.

Kim Jong-un orders North Koreans to give kids patriotic names like 'bomb','gun' and 'satellite'

Kim Jong-un : నార్త్ కొరియా రాక్షసుడు కిమ్ జోంగ్‌ ఉన్‌ మరో వింత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రజలు ఎలా ఉండాలో.. ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేయించుకోవాలో..ఎటువంటి దుస్తులు ధరించాలో..దేశ ప్రజలు ఎటువంటి సినిమాలు చూడాలో కూడా నిర్ణయించే నియంత కిమ్ మరో వింత నిర్ణయాన్ని ప్రజలు రుద్దారు. దేశంలో పుట్టిన పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలో కూడా నిర్ణయించారు. ఆదేశాలు కూడా జారీ చేశారు. కిమ్ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించే పరిస్థితే ఉండదు. అధ్యక్షుడు చెప్పింది పొల్లుపోకుండా పాటించి తీరాల్సిందే ప్రజలు వారి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే..అదంతా కిమ్ కు ఏమాత్రం అవసరం లేదు.

North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

తాను చెప్పటం ప్రజలు వినకపోవటమూనా…ప్రజలు అధ్యక్షుడి ఆదేశాలను పాటించకపోతే మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే అది నార్త్ కొరియా నియంత ఆదేశం..అంగీకరించి తీరాల్సిందే..లేకుంటా కఠిన శిక్షలే కాదు మరణశిక్ష విధించటానికి కూడా ఏమాత్రం వెనుకడని రాక్షసుడు కిమ్..అందుకే ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేసినా ప్రజలు ‘కిమ్’అనకుండా పాటించి తీరుతారు. ఈక్రమంలో వింత నిర్ణయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ దేశంలో పుట్టే పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలో కూడా ఆదేశాలు జారీ చేసిరపారేశారు…

Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

పిల్లలకు బాంబులు, గన్‌లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై రుద్దే ఆదేశాలు జారీ చేశారు కిమ్.తల్లిదండ్రులు తమ పిల్లలకు బాంబ్‌, గన్‌, శాటిలైట్‌ (ఉపగ్రహం) ఇలా దేశభక్తి అర్థం వచ్చే పేర్లను పెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యథావిధిగా హెచ్చరించారు.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

అంతేకాదు ఇప్పటికే పేర్లు పెట్టిన పిల్లల పేర్లు కూడా మార్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కిమ్ ఆదేశాల మేరకు ఇప్పటికే పేర్లు పెట్టిన పిల్లలకు పేర్లు మార్చాలని అధికారులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. పేర్ల చిర హల్లులు లేకపోతే అది సోషలిస్టుకు వ్యతిరేకం అట..అందుకే పేర్లు మార్చాలని లేదంటే జరిమానా విధిస్తామని అప్పటికే పేర్లు మార్చకపోతే శిక్షకూడా తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

గతంలో కిమ్ జాంగ్ ఉన్ తండ్రి, ఉత్తరకొరియా మాజీ అధినేత అయిన కిమ్ జాంగ్ చనిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూఉండాలని ఈ క్రమంలో ‘‘ప్రజలెవ్వరు నవ్వకూడదని..మద్యం సేవించి ఖుషీగా ఉండకూడదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జాంగ్ కు ప్రజలంత 11 రోజుల సంతాప దినాలు పాటించాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశాడు.సంతాప దినాలుగా పాటించే ఆ 11 రోజులు దేశంలో ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదని..నవ్వకూడదని..మద్యం సేవించకూడదని హుకుం జారీచేశారు సదరు కిమ్ గారు.

ఈ 11 రోజులు ప్రజలు కనీసం నవ్వినా..ఆల్కహాల్ సేవించినా..కఠిన శిక్షలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ ఆంక్షలు ఎంతగా ఉన్నాయంటే..దేశంలో ఎవ్వరు సంతోషకరమైన కార్యక్రమాలు చేసుకోకూడదు..పిల్లలు పుట్టిన రోజులు కూడా చేసుకోకూడదని నిబంధనలు విధించారు. ఇలా కిమ్ వింత నిర్ణయాలకు..ఆదేశాలు దేశ ప్రజలపై రుద్దుతుంటారు. కిమ్ ఎటువంటి వింత ఆదేశాలు ఇచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అధికారులు వంత పాడాల్సిందే..సార్ భలే భలే అంటూ భజన చేయాల్సిందే..చప్పట్లు కొట్టాల్సిందే.వారసత్వంగా వచ్చిన అధికారాన్ని తన వికృత నిర్ణయాలతో డిక్టేటర్ లా వ్యవహరిస్తుంటారు కిమ్.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

కాగా..1948లో నార్త్ కొరియా ఏర్పడింది. కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ టు సంగ్.. ఆ దేశాన్ని స్థాపించారు. 1948లో ఉత్తర కొరియా ఏర్పడినప్పటి నుంచి 1994లో చనిపోయేదాకా ఆయనే దేశాన్ని పాలించారు. 1945లో జపాన్ పాలన ముగిశాక అధికారంలోకి వచ్చిన కిమ్ టు సంగ్.. 1950లో దక్షిణ కొరియాపై దండెత్తాడు. కొరియా వార్‌లో సైనిక ప్రతిష్టంభన తర్వాత 1953 జులైలో కాల్పుల విరమణపై సంతకం చేశారు. ఇక.. 20వ శతాబ్దంలో 45 ఏళ్లకు పైగా పదవిలో ఉన్న మూడో అత్యంత ఎక్కువకాలం పనిచేసిన నాన్ రాయల్ హెడ్ ఆఫ్ స్టేట్‌‌గా కిమ్ టు సంగ్ చరిత్ర సృష్టించారు. ఆయన నాయకత్వంలో.. ఉత్తర కొరియా సోషలిస్ట్ రాజ్యంగా మారింది. సోవియట్ యూనియన్‌తో సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలను కలిగి ఉండేది. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థగానూ రూపుదిద్దుకుంది.