Rishi Sunak: ఇండియా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లగానే కష్టాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని

స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్‌ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్‌ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడా లేచాయి.

UK PM Rishi Sunak: జీ20 సదస్సులో (G20 Summit 2023) పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పలు కారణాలతో వార్తల్లో నిలిచారు. భారత పర్యటనలో తనకు లభించిన ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడంతా బాగానే జరిగింది కానీ, భారత్ నుంచి బ్రిటన్‌కు (Britain) తిరిగి వెళ్లగానే కష్టాలు మొదలయ్యాయి. వాస్తవానికి, హౌస్ ఆఫ్ కామన్స్‌లోని (యూకే దిగువ సభ) ఎంపీలు జీ20 సమావేశంలో రష్యాకు (Russia) వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకోలేదని ప్రధాని రిషి సునాక్ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. చారిత్రాత్మక కొత్త ఆర్థిక కారిడార్ ఒప్పందం నుంచి బ్రిటన్‭ను దూరంగా ఉంచినందున ప్రధానిని కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం కూడా దీనిపై ప్రశ్నలు సంధిస్తోంది. దీనితో పాటు, స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్‌ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్‌ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడా లేచాయి.

Kerala HC : స్విగ్గీ, జొమాటోలు వద్దు .. పిల్లలకు తల్లుల చేతిరుచులు చూపించండీ : కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రతిపక్ష నాయకుడు సర్ కీర్ స్టార్మర్ జీ20 ఉమ్మడి ప్రకటనను ప్రస్తావిస్తూ ఈ సమావేశాలు చాలా నిరుత్సాహపరిచాయని అన్నారు. గత సంవత్సరం జరిగిన శిఖరాగ్ర సమావేశం కంటే బలహీనంగా ఉందని అభివర్ణించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కాన్ఫరెన్స్‌కు బాధ్యత వహించి ఉంటే, భాష చాలా కఠినంగా ఉండేదన్న అభిప్రాయంతో సునాక్ ఏకీభవిస్తున్నారా అని లిబరల్ డెమొక్రాట్ ఎంపీ రిచర్డ్ ఫోర్డ్ అడిగారు.

Asia Cup 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా.. శ్రీలంక వర్సెస్ భారత్ మ్యాచ్ ఫొటోలు..

ప్రతిపక్షాలకు ప్రతిస్పందనగా ప్రధాని సునక్ స్పందిస్తూ.. ‘‘ఇది జీ7 లేదా జీ1 కాదు కాబట్టి, మనకు కావలసిన భాషను తీసుకోవడం వీలు కాదు. ఉక్రెయిన్‌పై మన స్టాండ్ ఏంటో అందరికీ తెలుసు. కానీ జీ20 అనేది ప్రపంచ వ్యవహారాలపై ఒకే దృక్పథం కలిగిన పెద్ద సమూహం. ఇది జీ7లోని ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరోపణలు చేసేవారు విదేశీ వ్యవహారాలు ఎలా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు.

Anand Mahindra : G20 లీడర్లకు అరకు కాఫీ బహుమతిగా ఇచ్చిన మోడీ.. హ్యాపీ ఫీల్ అయిన ఆనంద్ మహీంద్రా