Anand Mahindra : G20 లీడర్లకు అరకు కాఫీ బహుమతిగా ఇచ్చిన మోడీ.. హ్యాపీ ఫీల్ అయిన ఆనంద్ మహీంద్రా

జీ20 సమ్మిట్‌కి విచ్చేసిన దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అందులో అరకు కాఫీ కూడా ఉంది. దీనిని బహుమతిగా ఇవ్వడం తనకెంతో నచ్చిందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.

Anand Mahindra : G20 లీడర్లకు అరకు కాఫీ బహుమతిగా ఇచ్చిన మోడీ.. హ్యాపీ ఫీల్ అయిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra

Updated On : September 13, 2023 / 12:39 PM IST

Anand Mahindra : G20 లీడర్లకు ప్రధాని మోడీ అరకు కాఫీ బహుమతిగా ఇచ్చినందుకు ఆనంద్ మహీంద్రా సంతోషం వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసారు.

Anand Mahindra : షారుఖ్ ఖాన్‌ను ఆదాయ వనరుగా ప్రకటించాలంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. షారూఖ్ రిప్లై ఏంటంటే?

ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ G20 లీడర్లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ఇలా అందించడం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని మరోసారి హైలైట్ చేశారు. మోడీ ఇచ్చిన బహుమతుల్లో ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ కూడా ఉంది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న కాఫీ పరిశ్రమకు పర్యాయపదంగా మారిన అరకు కాఫీ బహుమతిగా ఇవ్వడం వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చిందట. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేసారు.

Anand Mahindra : ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి ఆనంద్ మహీంద్రా ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

అరకు ఒరిజనల్స్ బోర్డ్ చైర్మన్ హోదాలో ఉన్న మహీంద్రా ‘అరకు ఒరిజినల్స్ బోర్డు ఛైర్మన్‌గా ఈ బహుమతి ఎంపిక నాకు చాలా నచ్చింది. గర్వంగా కూడా ఉంది. అరకు కాఫీ ‘ది బెస్ట్ ఇన్ ది వరల్డ్, గ్రోన్ ఇన్ ఇండియాకి సరైన ఉదాహరణ’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు. అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్‌లోని సుందరమైన అరకు లోయలో ఉన్న సేంద్రీయ తోటల మీద సాగు చేస్తారు. ప్రపంచ దేశాల నేతలకు మోడీ భారత్ యొక్క వైవిధ్యమైన, గొప్ప రుచులను అందించడంతో పాటు అరకు కాఫీని అందించడం సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల పట్ల దేశం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.