Anand Mahindra : షారుఖ్ ఖాన్‌ను ఆదాయ వనరుగా ప్రకటించాలంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. షారూఖ్ రిప్లై ఏంటంటే?

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను 'ఆదాయ వనరుగా' ప్రకటించాలని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించారు.

Anand Mahindra : షారుఖ్ ఖాన్‌ను ఆదాయ వనరుగా ప్రకటించాలంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. షారూఖ్ రిప్లై ఏంటంటే?

Anand Mahindra

Updated On : September 9, 2023 / 1:24 PM IST

Anand Mahindra : పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షారుఖ్ ఖాన్‌ను ఆదాయ వనరుగా ప్రకటించాలని ట్వీట్ చేసారు. బాలీవుడ్ సూపర్ స్టార్ తాజా చిత్రం ‘జవాన్’ హిట్ నేపథ్యంలో మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఆయన ట్వీట్‌కి షారుఖ్ రిప్లై ఇచ్చారు.

Jawan Collections : జవాన్ మొదటి రోజు 120 కోట్లు దాటినా.. ఆదిపురుష్ ఫస్ట్ డే రికార్డ్ అందుకోలేకపోయింది..

షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాని విజయాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. షారుఖ్‌ను ఆదాయ వనరుగా ప్రకటించాలని ట్వీట్ చేసారు. మహీంద్రా బుర్జ్ ఖలీఫాలో జవాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వీడియోతో పాటు దుబాయ్‌లో షారుఖ్ తన అభిమానుల్ని అభినందిస్తున్నట్లు చూపించే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసారు. ‘అన్ని దేశాలు తమ సహజ వనరుల్ని కాపాడుకుంటాయి. వాటిని తవ్వి ఎగుమతులు చేస్తాయి. షారుఖ్‌ని ఆదాయ వనరుగా ప్రకటించే సమయం ఆసన్నమై ఉండవచ్చు’ అనే శీర్షికతో పోస్టు పెట్టారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి షారుఖ్ ఖాన్ రిప్లై ఇచ్చారు.. ‘మీకు ధన్యవాదాలు. సినిమా మేకింగ్ విషయంలో మన దేశం గర్వపడేలా చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే పరిమితం కాను.. మీకు బిగ్ హగ్ సార్’ అంటూ ట్వీట్ చేసారు. వీరిద్దరి ట్వీట్లు వైరల్ అవుతోంది. నెటిజన్లు షారుఖ్‌పై అభినందనలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Jawan Movie: జవాన్‌ సినిమాలో షారుక్ ఖాన్ పట్టుకున్న ఫోనుపై ఎందుకింత రచ్చ రచ్చ?
జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డబుల్ రోల్‌లో నటించారు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా దీపికా పదుకొణే ప్రత్యేక పాత్రలో నటించారు.