Priyanka Chopra: బైడెన్.. వెంటనే ఇండియాకు వ్యాక్సిన్ పంపించగలరా – ప్రియాంక చోప్రా

నటి ప్రియాంక చోప్రా.. హార్ట్ బ్రేక్ అయిందట. ఇండియాలో పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని.. అర్జెంటుగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను ప్రపంచం మొత్తానికి పంచినట్లుగా తన దేశానికి పంపించాలని...

Priynaka Chopra Joe Biden

Priyanka Chopra: నటి ప్రియాంక చోప్రా.. హార్ట్ బ్రేక్ అయిందట. ఇండియాలో పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని.. అర్జెంటుగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను ప్రపంచం మొత్తానికి పంచినట్లుగా తన దేశానికి పంపించాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను కోరుతుంది. సోషల్ మీడియా వేదికగా ప్రెసిడెంట్ జో బైడెన్ ను అడగడమే కాకుండా @POTUS @WHCOS @SecBlinken @JakeSullivan46 లను ట్యాగ్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అవసరం ఉన్న వాళ్లందరికీ దాదాపు 550మిలియన్ల వ్యాక్సిన్లు సప్లై చేశారు. ఇండియాకు కూడా పంపించగలరా.. అని అడిగింది. ఆమె ట్వీట్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత లేట్ గా అడుగుతావా అంటూ.. కనీసం ఒక రెండు వారాల క్రితమైనా అడిగి ఉండాల్సింది. మీ దేశం వాళ్ల కోసం ఇప్పటి వరకూ ఆగాల్సింది కాదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

మరొకరేమో.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావని అన్నాడు. మరొక వ్యక్తేమో.. వావ్.. నీ హార్ట్ ఇంత త్వరగా బ్రేక్ అయిందా.. అని కామెంట్ చేశాడు.