Maldives : మాల్దీవుల అధ్యక్షుడిగా మొహహ్మద్ మయిజ్జు విజయం

మాల్దీవులలో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూల అభ్యర్థి మొహమ్మద్ మయిజ్జు విజయం సాధించారు. మొహమ్మద్ మయిజ్జు 54.06 శాతం ఓట్లతో విజయం సాధించారు....

Mohamed Muizzu

Maldives : మాల్దీవులలో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూల అభ్యర్థి మొహమ్మద్ మయిజ్జు విజయం సాధించారు. మొహమ్మద్ మయిజ్జు 54.06 శాతం ఓట్లతో విజయం సాధించారు. మాల్దీవ్స్ డెమొక్రటిక్ పార్టీపై ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నేత, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి మయిజ్జు ఎన్నికయ్యారు. శనివారం అర్దరాత్రి ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఓటమిని అంగీకరించారు.

Afghan embassy : భారత్‌లో అఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత

(Muizzu Wins Maldives Presidency) 45 ఏళ్ల మయిజ్జు చైనా దేశానికి అనుకూల వ్యక్తి. (Pro-China Candidate Mohamed Muizzu) దీనివల్ల మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘‘అధ్యక్షుడిగా ఎన్నికైన మయిజ్జుకు అభినందనలు, శాంతియుత, ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రదర్శించిన ప్రజలను కూడా నేను అభినందిస్తున్నాను’’ అని సోలిహ్ ఎక్స్ లో రాశారు. ఎన్నికల ప్రచార ఆంక్షలు అధికారికంగా ముగిసే వరకు ఆదివారం ఉదయం వరకు సంబరాలు చేసుకోవద్దని మద్ధతుదారులను ముయిజ్జు కోరారు.

Road Accident : తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టూరిస్టు బస్సు, 8 మంది మృతి

61 ఏళ్ల సోలిహ్ తన వారసుడు నవంబర్ 17వతేదీన ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే తూర్పు-పడమర షిప్పింగ్ లేన్‌లలో ఒకటైన హిందూ మహాసముద్రం మధ్యలో మాల్దీవులు ఉంది. మయిజ్జు తన గురువు, మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా నుంచి భారీగా అప్పులు చేశారు.

Jamili Elections : జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు.. జాతీయ లా కమిషన్ కీలక ప్రకటన

గతంలో యమీన్ పై పెరుగుతున్న నిరంకుశ పాలనపై అసంతృప్తి నేపథ్యంలో సోలిహ్ 2018వసంవత్సరంలో ఎన్నికయ్యారు. మాల్దీవుల దేశాన్ని చైనా అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. మయిజ్జు యమీన్‌ను విడిపిస్తానని ప్రమాణం చేశారు. మయిజ్జు తన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించాలని, యమీన్‌ను గృహనిర్బంధానికి తరలించాలని అవుట్‌గోయింగ్ అధ్యక్షుడిని కోరారు.

ట్రెండింగ్ వార్తలు