కరోనా మహమ్మారి ప్రభావంతో మృతుల రేటును తగ్గించడంలో విఫలమైనందుకు యాంటీ మలేరియా డ్రగ్, హెచ్‌ఐవీ ఔషధాల ట్రయల్స్‌ను నిలిపేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆదివారం ప్రకటించింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ)తోపాటు హెచ్‌ఐవీని నివారించడానికి వాడే లొపినావిర్/రిటోనావిర్ ఔషధాలు వినియోగించిన కరోనా రోగుల మరణాలు తగ్గిపోయాయని మధ్యంతర ట్రయల్స్ నివేదిక తెలిపింది.
దీంతో ఆ ఔషధాలను మధ్యంతరంగా నిలిపివేయాలని ట్రయల్స్ అధికారులను డబ్ల్యూహెచ్‌వో అభ్యర్థించింది. అయితే, అమెరిక సంస్థ గిలాడ్‌కు చెందిన యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డిసివిర్‌పై ట్రయల్స్‌లో సమర్థవంతమైన ఫలితాలనిస్తుందని మరో ట్రయల్స్ బృందం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ తమ సభ్య దేశాల్లో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు రెమ్‌డెసివిర్ వాడటానికి షరతులతో అనుమతినిచ్చింది.
ప్రాణాంతక కరోనా వైరస్ అరికట్టడంలో ఈ డ్రగ్స్‌పై డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల ప్రయోగాలకు సంబంధించిన ఫలితాల్లో ఔషధాల ప్రభావం తక్కువగా ఉందని పేర్కొన్నది. ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగుల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్, లోపినావిర్/రిటోనవిర్ ఔషధాలు కొందరిలో తక్కువగా, మరికొందరిలో మొత్తానికే ప్రభావం చూపలేదని ప్రకటించింది. ఈ క్రమంలో మరణాల రేటును తగ్గించడంలో ఏమాత్రం సఫలం కాలేదని తెలిపింది.
ఈ నేపథ్యంలో అధ్యయనాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. కాగా, దవాఖానలో చేరని వారిపై, వైరస్ ముప్పును తప్పించుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా హెచ్‌సీక్యూ ఉపయోగించవచ్చో.. లేదో.. పరీక్షించేందుకు జరుగుతున్న ప్రయోగాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
Read Here >>మనుషులపై ప్రయోగదశలో కరోనా వ్యాక్సిన్