Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
సామ్సంగ్ సంస్థకు చెందిన ఒక వైఫై ఎనేబుల్డ్ డివైజ్ నుంచి మొహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ప్రసారం కావడంతో ముస్లింలు ఆగ్రహంతో ఊగిపోయారు. కరాచీలోని ఒక మాల్లో సామ్సంగ్ కంపెనీ ఆ డివైజ్‌ను ఏర్పాటు చేసింది.

Pakistan
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు మంటలు రాజేస్తున్నాయి. కరాచీలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా సామ్సంగ్ కంపెనీ ఔట్లెట్లు, బిల్‌బోర్డులు, హోర్డింగ్‌లను నాశనం చేశారు. వీధుల్లో టైర్లు వేసి కాల్చారు.
సామ్సంగ్ సంస్థకు చెందిన ఒక వైఫై ఎనేబుల్డ్ డివైజ్ నుంచి మొహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ప్రసారం కావడంతో ముస్లింలు ఆగ్రహంతో ఊగిపోయారు. కరాచీలోని ఒక మాల్లో సామ్సంగ్ కంపెనీ ఆ డివైజ్‌ను ఏర్పాటు చేసింది. ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఆ డివైజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సామ్సంగ్ కంపెనీకి చెందిన 27 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మత విద్వేష వ్యాఖ్యలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఎక్కడ జనరేట్ అయిందనే విషయమై ఆరా తీస్తున్నారు. మరోవైపు… ఈ ఘటనపై సామ్సంగ్ కంపెనీ వివరణ ఇచ్చింది. మతపరమైన విషయాల్లో తమ సంస్థ తటస్థ వైఖరిని అవలంభిస్తుందని వివరించింది.