బైడెన్‌ను విష్ చేయడానికి నో చెప్తున్న పుతిన్

Vladimir Putin: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బైడెన్‌ను విష్ చేయడానికి నో చెప్తున్నాడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. ఇటీవల ముగిసిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల తీరును ప్రశ్నిస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ట్రంప్. న్యాయ విచారణ జరిగి తాను ఓడిపోయానని కన్ఫామ్ అయిన తర్వాతే వైట్ హౌజ్ నుంచి బయటకు వెళ్తానని తిష్ట వేసుకుని కూర్చున్నాడు.

ఇదిలా ఉంటే ట్రంప్ దారిలోనే.. లీగల్ ప్రోసెస్ పూర్తి అయిన తర్వాతే తాను జో బైడెన్‌ను విష్ చేస్తానని పుతిన్ కూడా చెప్తున్నారు. అధికారికంగా కొత్త ప్రెసిడెంట్‌ను కన్ఫామ్ చేసిన తర్వాతే రష్యా గుర్తిస్తుందని అధికార ప్రతినిధి మిత్రీ పెస్కో సోమవారం వెల్లడించారు.



కరెక్ట్ పని చేయడానికి మేం వెయిట్ చేస్తున్నామని జర్నలిస్టులతో చెప్పాడు పుతిన్. అమెరికన్ నేషన్ తీసుకున్న చాయీస్ ను తాను గౌరవిస్తానని ప్రెసిడెంట్ పుతిన్ చాలాసార్లు చెప్పారు. మాజీ వైస్ ప్రెసిడెంట్.. డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన అధ్యక్ష పోరులో గట్టిపోటీ దాటి పెన్సిల్వేనియా 20 ఎలక్టోరల్ కాలేజి ఓట్లతో సెక్యూర్ గా ఉన్నారు.

యూఎస్-రష్యాల మధ్య కోల్డ్ వార్ జరిగినప్పటి నుంచి సంబంధాలు సరిగా ఉండటం లేదు. పుతిన్, బైడెన్ ల మధ్య బంధాలు కూడా అంతగా బాగాలేవు. 2014లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ.. పుతిన్‌కు మనసు లేదని వ్యాఖ్యానించాడు.