Queen Elizabeth final journey : రాణి ఎలిజబెత్ అంతిమయాత్రలో మొదటిదశ పూర్తి .. బల్మోరల్ ప్యాలెస్ నుంచి .. ఎడిన్‌బర్గ్‌కు రాణీ పార్థివదేహం తరలింపు..

రాణి ఎలిజబెత్ అంతిమయాత్రలో మొదటిదశ పూర్తి అయ్యింది. ఆమెకు ఎంతో ఇష్టమైన బల్మోరల్ ప్యాలెస్ నుంచి .. ఎడిన్‌బర్గ్‌కు రాణీ ఎలిజబెత్ పార్థివదేహాన్ని తరలించారు. ఈ నెల 8న రాణి ఎలిజబెత్ మరణించిన దగ్గరినుంచి ఆమె పార్థివ దేహాన్ని బాల్‌రూమ్‌లోనే ఉంచారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఎడిన్‌బర్గ్‌కు తరలించారు. అబెర్డన్, డ్యుండీ నగరాల మీదగా రాణి ఎలిజబెత్ చివరి ప్రయాణం ఎడిన్ బర్గ్‌ వరకు సాగింది. ఆరుగంటల పాటు ఈ ప్రయాణం జరిగింది. దారిపొడవునా వేలాదిమంది ప్రజలు బారులు తీరి..సుదీర్ఘకాలం బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఏలిన రాణికి తుదివీడ్కోలు పలికారు.

Queen Elizabeth final journey : రాణి ఎలిజబెత్‌కు బ్రిటన్‌తో పాటు ప్రపంచ దేశాలు ఘనంగా నివాళులర్పిస్తున్నాయి. ఈ నెల 19న రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రాణి ఎంతగానో ఇష్టపడే బల్మోరల్ ప్యాలెస్ నుంచి…ఆమె భౌతిక కాయాన్ని రోడ్డు మార్గంలో ఎడిన్‌బర్గ్‌కు తరలించారు. గంటలపాటు సాగిన ఈ ప్రయాణంలో దారి పొడవునా బ్రిటన్ ప్రజలు రాణికి ఘననివాళి అర్పించారు.

క్వీన్ ఎలిజబెత్ కు ఎంతో ఇష్టమైన బల్మోరల్ ప్యాలెస్..
రాణికి ఎంతో ఇష్టమైన బల్మోరల్ ప్యాలెస్‌లోని బాల్‌రూమ్ నుంచి ఆఖరి ప్రయాణం చేశారు. రాణి అంతిమ యత్రలో ఇది మొదటిదశ. ఈ నెల 8న రాణి ఎలిజబెత్ మరణించిన దగ్గరినుంచి ఆమె పార్థివ దేహాన్ని బాల్‌రూమ్‌లోనే ఉంచారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఎడిన్‌బర్గ్‌కు తరలించారు. అబెర్డన్, డ్యుండీ నగరాల మీదగా రాణి ఎలిజబెత్ చివరి ప్రయాణం ఎడిన్ బర్గ్‌ వరకు సాగింది. ఆరుగంటల పాటు ఈ ప్రయాణం జరిగింది. దారిపొడవునా వేలాదిమంది ప్రజలు బారులు తీరి..సుదీర్ఘకాలం బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఏలిన రాణికి తుదివీడ్కోలు పలికారు. ఆయా మార్గాల్లో ప్రజలు రాణి ప్రయాణం చూసేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. ఎడిన్‌బర్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఒకరోజు పాటు రాణి భౌతికకాయాన్ని ఉంచుతారు. ఎడిన్‌బర్గ్‌లో నిర్వహించే ప్రత్యేక ఊరేగింపులో రాణి కుటుంబసభ్యులు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మంగళవారం విమానంలో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు రాణి పార్థివదేహాన్ని తరలిస్తారు.

అప్పటికే కింగ్ చార్లెస్, క్వీన్‌ కన్సార్ట్ వెస్ట్ మినిస్టర్ హాల్‌కు చేరుకుంటారు. సంతాప సందేశాలు అందుకుంటారు. బుధవారం (సెప్టెంబర్ 14,2022)నుంచి వెస్ట్ మినిస్టర్ హాల్‌లో క్వీన్ భౌతికకాయాన్ని నాలుగురోజుల పాటు ఉంచుతారు. ఆ సమయంలో సాధారణ జనాలకు ఆమె పార్థివదేహాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. వెస్ట్ మినిస్టర్ అబేలోనే ఆమెకు వచ్చే సోమవారమయిన ఈ నెల 19న అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాణి కుటుంబ సభ్యులు, రాజకీయనాయకులు, ప్రపంచ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. విన్స్‌డర్‌లోని కింగ్ జార్జ్ -6 మెమోరియల్‌లో రాణి శాశ్వత విశ్రాంతి పొందుతారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా బ్రిటన్‌లో సంతాపదినాలు పాటిస్తున్నారు. తర్వాత మరో వారం రోజుల పాటు రాచకుటుంబం సంతాప దినాలు పాటిస్తుంది.

బ్రిటన్ రాజులు, రాణుల పట్టాభిషేకం జరిగిన చారిత్రక చర్చ్ వెస్ట్ మినిస్టర్..
వెస్ట్ మినిస్టర్ అబే..చారిత్రక చర్చ్. బ్రిటన్ రాజులు, రాణులు అందరి పట్టాభిషేకం ఇక్కడే జరిగింది. 18వ శతాబ్దం తర్వాత ఈ చర్చిలో రాచకుటుంబంలో ఎవరి అంత్యక్రియలూ ఇక్కడ జరగలేదు. రాణి తండ్రి, తాత సహా నాయనమ్మకు నాయనమ్మ విక్టోరియా మహారాణి అంత్యక్రియలు సైతం విన్స్‌డర్‌లోని సెయింట్ జార్జ్ చాపల్‌లో జరిగాయి.

గాడ్ సేవ్‌ ది కింగ్ అంటూ బ్రిటన్ ప్రజల నినాదాలు
రాణికి బ్రిటన్ యావత్తూ ఘన నివాళి అర్పిస్తోంది. 70 ఏళ్లలో తొలిసారి చర్చి బెల్స్ మూకమ్మడిగా మోగించారు. రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ రాజయ్యారు. సెయింట్ జేమ్స్ ప్యాలస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రాజుగా తల్లి అడుగుజాడల్లో నడుస్తానని ఆయనన్నారు. బకింగ్ హామ్ ప్యాలెస్ దగ్గరకు భారీగా తరలివస్తున్న ప్రజలతో రాజు చార్లెస్ మాట్లాడారు. గాడ్ సేవ్‌ ది కింగ్ అంటూ బ్రిటన్ ప్రజలు నినదించారు.

ట్రెండింగ్ వార్తలు