Gangrape
Victims for Medical Exams: రేప్ బాధితులు కంప్లైంట్ ఇచ్చాకే మెడికల్ టెస్టుల కోసం రూ.25వేలు చెల్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఖైబర్ మెడికల్ కాలేజీ యూనివర్సిటీ ఈ మేర ఫీజులు ఫిక్స్ చేసి.. వైద్య పరీక్షలకు రూ.25వేలు, ఆటోప్సీ పరీక్ష కోసం రూ.5వేలు ఇవ్వాలని వెల్లడించింది.
ఫిబ్రవరి 14న మేనేజ్మెంట్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో 17కొత్త ఛార్జీలు విధించారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఇన్వెస్టిగేట్ చేయడం కోసం లిమిటెడ్ బడ్జెట్ మాత్రమే ఉంటుంది. లోకల్ పోలీసులు అటువంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు బాధిత కుటుంబాల నుంచి ఫీజులు వసూలు చేయాలని, అదనంగా డీఎన్ఏ టెస్టులకు కూడా వారి నుంచే తీసుకోవాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ కు వెళితే.. వాళ్లు డీజిల్, పెట్రోల్ కోసం డబ్బులు అడుగుతుంటారు. ఇప్పుడు మెడికల్ టెస్టులకు డబ్బులు అడగడం మొదలుపెడతారు అని రైట్స్ యాక్టివిస్ తమూర్ కమల్ అన్నారు. ఈ ఫీజులన్నీ ప్రతిపదన దశలో ఉండగా చర్చల తర్వాత వీటి ధరలను ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు.