1623వ సంవత్సరం తర్వాత ఆకాశంలో మరో అద్భుతం: క్రిస్టమస్ కోసం స్పెషల్ స్టార్

కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆకాశంలో మళ్లీ ఒకసారి అద్భుతం కనిపించనుంది. 2020 డిసెంబర్ 21న కనిపించే ఈ అపురూప దృశ్యం గతంలో 1226 మార్చి 4న జరగ్గా తర్వాత 1623వ సంవత్సరంలో సంభవించింది. దీనినే గ్రేట్ కంజక్షన్(మహా కూటమి) అంటారు.
గురు గ్రహం, శని గ్రహం కలిసి కొత్త వాతావరణం కనిపిస్తుంది. భూమి నుంచి చూస్తున్నప్పుడు ఇవి కలిసి ఉన్నట్లుగా కనిపించడంతో షైనింగ్ స్టార్ లా మెరిసిపోతాయి. నిజానికి అది భూమికి 450మిలియన్ మైల్స్ దూరంలో జరిగే ఘటన. క్రిస్టమస్ సందర్భంగా వస్తున్న ఈ చారిత్రక ఘటనను సైంటిస్టులు క్రిస్టమస్ స్టార్ గానూ, స్టార్ ఆఫ్ బెత్లెహెంతోనూ పోలుస్తున్నారు.
‘ఈ రెండు గ్రహాల కలయిక అనేది ప్రతి 20సంవత్సరాలకు లేదా.. చాలా అరుదుగా జరిగే ఘటన. ఎందుకంటే ఒక గ్రహంపై మరొకదాని ప్రభావం వ్యక్తపరుస్తుంది. అని రైస్ యూనివర్సిటీ ఫిజిక్స్, ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ప్యాట్రిక్ హ్యార్టిగన్ అంటున్నారు.
డిసెంబర్ 21 సాయంత్రం మనం రెండు గ్రహాలను చూసినట్లుగా ఫీల్ అవతాం. టెలిస్కోపు నుంచి చూస్తే ప్రతి గ్రహం, వాటికి సంబంధించి చంద్రులు కూడా కనిపించే అవకాశం ఉందని హార్టిగన్ వివరించారు. ఇది మొత్తం జరిగేది సూర్యాస్తమయం అయిన గంటకు మాత్రమేనని నాసా చెబుతుంది.
ఈ విషయాన్ని నాసా తన వెబ్ సైట్లోనే రాసుకొచ్చింది. డిసెంబర్ 21న రెండు దిగ్గజ గ్రహాలు వాటిల్లో ఉన్న పదో వంతు మాత్రమే కనిపించనున్నాయి. వాటి కదలికను భూమిపై నుంచి చూస్తే ఒకదాన్లో ఒకటి కలిసి పోయినట్లుగానే కనిపిస్తుందని నాసా చెబుతుంది. మనకు కనిపించడమనేది ఏర్పడే వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
వర్జినీయా టెక్ ఫిజిక్స్ ఫ్రొఫెసర్ నహూమ్ ఆరవ్ దీనిని అరుదైన ఘట్టంతో పోల్చి చెబుతున్నారు. అంతటి ప్రకాశవంతమైన గ్రహాలు ఒకచోటికి చేరడం, చంద్రుడి వ్యాసంలోకి ఐదో వంతు చొచ్చుకురావడం వంటివి చూడాలంటే కొందరు బైనాక్యులర్ సహయంతో మాత్రమే వీక్షించగలం’ అని వివరిస్తున్నారు.
ఇలాంటి అద్భుతం మళ్లీ ఒకసారి చూడాలంటే.. 2080 మార్చి 15వరకూ చూడాల్సిందే. ఆ తర్వాత మళ్లీ చూడాలంటే సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత 2400 సంవత్సంలో మాత్రమే అది సాద్యమవుతుంది.