ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్‌లను పట్టి పీడించిన జబ్బు.. ఇప్పటికీ చిన్న పిల్లలను వేధిస్తోంది. ఇటీవల డైనోసర్ అవశేషాలపై జరిపిన పరిశోధనలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కెనడాలోని రీసెర్చ్ సెంటర్‌లో ఓ యంగ్ డైనోసర్ తోకలో ఉన్న ప్రాణాంతక వ్యాధి గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మైక్రో సీటీ స్కాన్ ద్వారా ఇజ్రాయేల్ రీసెర్చర్‌లు తోక గురించి పరిశోధన చేశారు.
లాంగెరాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్(ఎల్సీహెచ్)ను కొన్ని సార్లు క్యాన్సర్‌గా కూడా ట్రీట్ చేస్తారు. ఎన్‌హెచ్ఎస్, ఎల్సీహెచ్ పరీక్షల ఫలితాలు అవశేషాల్లోని అసాధారణ పరిస్థితులను బయటపెట్టాయి. అందులో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. యూఎస్ గవర్నమెంట్ ఏజెన్సీకి చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ దానిని క్యాన్సర్‌గా తేల్చింది.
అనాటమీ అండ్ ఆంథ్రోపాలజీ లెక్చరర్ డాక్టర్ హిలా మే.. డైనోసర్ తోకలో రెండు భాగాల్లో జబ్బు ఏర్పడింది. ఇలాంటి జబ్బు కనుగొనడం ఇదే తొలిసారి. ఈ స్టడీ కారణంగా మెడిసన్ కనుగొనేందుకు వీలు అవుతుందని రీసెర్చర్స్ అంటున్నారు.
చిన్నారుల్లోనూ ఎల్సీహెచ్ లక్షణాలు కనిపిస్తాయని సాధారణంగా ఇవి 2నుంచి 10సంవత్సరాల మధ్య వయస్సున్న మగపిల్లల్లో సంభవిస్తుంది. ఎముకల్లో వచ్చే ఈ ట్యూమర్ ఎముకలను బలహీనం చేయడమే కాకుండా విపరీతమైన నొప్పితో బాధపెడుతుంది. కొన్నిసార్లు ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం దక్కదు.