Israel Palestine Conflict: పాలస్తీనా వివాదంపై మాట్లాడినందుకు హోంమంత్రిని తొలగించిన ప్రధాని

ప్రో పాలస్తీనా మోబ్ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని లండన్ పోలీసులు విస్మరిస్తున్నారని బ్రేవర్‌మాన్ అన్నారు. గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన నిరసనకారులు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆమె అభివర్ణించారు

Israel Palestine Conflict: పాలస్తీనా వివాదంపై మాట్లాడినందుకు హోంమంత్రిని తొలగించిన ప్రధాని

Israel Palestine Conflict: బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ను బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ తొలగించారు. పాలస్తీనా అనుకూల నిరసనకారుల పట్ల పోలీసులు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను తొలగించినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బ్రేవర్‌మన్ తొలగించినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. అయితే నివేదిక ప్రకారం.. బ్రేవర్‌మాన్‌ను తొలగించాలని సునక్‌పై ఒత్తిడి పెరిగింది. కారణం, ఇజ్రాయెల్-హమాస్ వివాదం ప్రారంభమైన తర్వాత లండన్‌లో జరిగిన ప్రదర్శనల కఠినంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ మెట్రోపాలిటన్ సిటీ పోలీసులను బ్రావర్‌మాన్ లక్ష్యంగా చేసుకున్నారు.

ప్రో పాలస్తీనా మోబ్ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని లండన్ పోలీసులు విస్మరిస్తున్నారని బ్రేవర్‌మాన్ అన్నారు. గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన నిరసనకారులు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆమె అభివర్ణించారు. దాంతో ప్రతిపక్ష పార్టీతో పాటు సొంత పార్టీకి చెందిన కొందరు ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇదే కాకుండా, ప్రధాని అనుమతి లేకుండా ఆమెకు ట్రైమ్స్ పత్రికలో గాజా గురించి ఆర్టికల్ రాశారు. అయితే బ్రేవర్‌మ్యాన్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్న డౌనింగ్ స్ట్రీట్ (ప్రధాని కార్యాలయం), అయితే టైమ్స్‌లోని అభిప్రాయ కథనంలో ఆమె వ్యాఖ్యలు ప్రధాని సునక్ సమ్మతి లేకుండా ఎలా ప్రచురించబడ్డాయనే దానిపై వారు దర్యాప్తు చేస్తున్నారు. దీనితో పాటు, అభిప్రాయ కథనాలు ప్రధాని అభిప్రాయాలతో సరిపోలడం లేదని సునక్ ప్రతినిధి చెప్పారు.