Russia Ban Meta Ceo Mark Zuckerberg Is Not Welcome In Russia
Russia Ban : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రష్యా యుద్ధాన్ని ఆపాలంటూ పాశ్చాత్య దేశాలు హెచ్చరించాయి. రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇందులో భారత్, చైనా తటస్థ వైఖరితో ఉండగా.. మిగతా ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు మరింత రెచ్చిపోయాడు. తన దేశంపై ఆంక్షలు విధించిన దేశాలపై రివేంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. యుక్రెయిన్‌పై యుద్ధం పేరుతో రష్యాపై ఆంక్షలు విధిస్తారా? అంటూ ప్రతీకారంతో పుతిన్ ఊగిపోతున్నారు. ఏకంగా ప్రతీకార చర్యలకు దిగారు.
అందులో భాగంగానే ఒక బ్లాక్ లిస్టు రెడీ చేశారట.. వరుస పెట్టి ఆయా దేశాల ప్రముఖులపై బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు పుతిన్.. ఇప్పుడా జాబితాలోకి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ పేరు కూడా చేర్చారు. రష్యాలో హారీస్ ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు. మెటా దిగ్గజం సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పేరును కూడా ఆ జాబితాలో చేర్చారు. రష్యాలో రాకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యా ప్రకటించిన ప్రముఖల బ్యాన్ లిస్టులో వ్యాపార దిగ్గజాలు కూడా చేర్చింది రష్యా..
Russia Ban Meta Ceo Mark Zuckerberg Is Not Welcome In Russia
జుకర్‌బర్గ్, హారిస్ సహా ఇతర ప్రముఖులను రష్యాలోకి రాకుండా నిరవధికంగా నిషేధించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధించిన వ్యక్తులలో లింక్‌డిన్ CEO Linkedin Ryan Roslansky కూడా ఉన్నారు. అలాగే ‘రష్యాఫోబిక్’ ఎజెండాను ప్రోత్సహిస్తున్నారంటూ కొంతమంది ప్రొఫైల్‌లతో కూడిన పాత్రికేయులపై కూడా రష్యా నిషేధం విధించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్‌ను రష్యా మంత్రిత్వ శాఖ నిషేధించలేదు. రష్యాపై పోస్ట్ చేసిన తప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ తొలగిస్తోంది.
అయితే జుకర్‌బర్గ్‌ను దేశంలోకి రాకుండా రష్యా నిషేధించడంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే రష్యా గతంలో ఉగ్ర చట్టం కింద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను నిషేధించింది. రష్యాలో విస్తృతంగా వినియోగించే యాప్‌ల్లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లే ఎక్కువ.. ఈ సోషల్ ప్లాట్ ఫాంల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆదేశ విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. ఫేస్‌బుక్ సంస్థ అయిన వాట్సాప్‌ను మాత్రం రష్యా నిషేధించలేదు. ఈ యాప్‌ను రష్యా తమ కమ్యూనికేషన్ కోసం వినియోగించుకుంటోంది. మెటా సంస్థ కార్యకలాపాలు రష్యా, సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఉంటాయని FSB ప్రతినిధి ఇగోర్ కోవెలెవ్స్కీ కోర్టుకు తెలిపారు.
Read Also : Vladimir Putin: రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామన్న యూరోప్ దేశాలకు పుతిన్ స్వీట్ వార్నింగ్