మనుషుల్లో బర్డ్ ఫ్లూ.. రష్యాలో తొలి కేసు నమోదు

Bird Flu: ఇన్నాళ్లుగా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదనుకుంటున్న వారికి చేదు వార్తే ఇది. రష్యాలో తొలిసారిగా H5N8వైరస్ సోకింది. డిసెంబర్ లో ఫౌల్ట్రీ ప్లాంట్ లో పనిచేస్తున్న ఏడుగురు వర్కర్లకు సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ‘అందరూ సేఫ్ గానే ఉన్నారు’ అని రష్యా కన్జ్యూమర్ హెల్త్ వాచ్ డాగ్, అన్నా పొపోవా చెప్పారు.
ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకుని కట్టడి చేయగలిగామని ఆమె అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది.
రష్యా వెక్టార్ ల్యాబొరేటరీ నిర్వహించిన ఇంపార్టెంట్ సైంటిఫిక్ డిస్కవరీలో ఈ విషయం తెలిసింది. ఈ వైరస్ ఇంకా మనుషుల నుంచి మనుషులకు సోకేంత బలంగా లేదు. సాధ్యపడినన్ని మ్యూటేషన్స్ సమయానికి తగ్గట్లుగా ఫాలో అయ్యే తీవ్రతను పెరగకూడదనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రష్యా సైంటిస్టులు పని మొదలుపెట్టి సిస్టమ్స్ ను డెవలప్ చేస్తున్నారని ఆమె చెప్పారు. కొన్ని రకాల బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు మనుషుల ప్రాణాలు పోగొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు నమోదైన తొలి కేసులు H5N8కు చెందినదని అధికారులు వెల్లడించారు.